top of page
MediaFx

ఆన్‌లైన్ షాపింగ్ చేసేవారికి గుడ్‌న్యూస్.. మీకోసమే లాంచ్ చేసిన 5 క్రెడిట్ కార్డులు ఇవే..🛍️💳


ప్రస్తుతం అనేక బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఆన్‌లైన్ షాపింగ్‌ కోసం స్పెషల్ క్రెడిట్‌ కార్డులను జారీ చేస్తున్నాయి. అదనపు ప్రోత్సహకాలు అందించడానికి వివిధ కంపెనీలు లేదా బ్రాండ్‌లతో ఒప్పందం కుదుర్చుకుంటున్నాయి. వీటి ద్వారా కస్టమర్లు బిల్లులను చాలా వరకు సేవ్ చేసుకోవచ్చు. పైసాబజార్.కామ్ రిపోర్ట్ ప్రకారం.. ఆన్‌లైన్ షాపింగ్ ఎక్కువగా చేసే వారికి ఉపయోగపడే టాప్ 5 క్రెడిట్‌ కార్డులు ఏవో చూద్దాం.

అమెజాన్ పే ఐసీఐసీఐ క్రెడిట్ కార్డ్

ఈ కార్డ్ యాక్సెస్ కోసం ఎలాంటి జాయినింగ్ ఫీజు, యాన్యువల్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు, జీవితకాలం ఉచితంగా వాడుకోవచ్చు. కస్టమర్లు అమెజాన్‌లో షాపింగ్ చేస్తే ప్రైమ్ మెంబర్స్ 5% క్యాష్‌బ్యాక్‌ పొందవచ్చు. నాన్-ప్రైమ్ కస్టమర్లకు 3% క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. అమెజాన్ వంద కంటే ఎక్కువ మర్చెంట్ పార్ట్నర్స్ నుంచి చేసే కొనుగోళ్లపై 2% క్యాష్‌బ్యాక్ అందిస్తోంది. ఇతర ట్రాన్సాక్షన్స్‌పై కనీసం 1% క్యాష్‌బ్యాక్ ఉంటుంది. ICICI బ్యాంక్ పార్ట్నర్ రెస్టారెంట్లలో 15% డిస్కౌంట్ సైతం లభిస్తుంది. అన్ని పెట్రోల్ బంక్‌ల్లో 1% ఇంధన సర్‌ఛార్జ్ మినహాయింపు ప్రయోజనం పొందవచ్చు.

యాక్సిస్ బ్యాంక్ ACE క్రెడి‌ట్‌‌ కార్డ్

యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్‌ కార్డ్ కోసం జాయినింగ్ ఫీజుగా రూ.499, యాన్యువల్ ఫీజుగా కూడా అంతే మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. ఈ కార్డుతో గూగుల్ పేలో బిల్లుల చెల్లింపులు, DTH రీఛార్జ్, మొబైల్ రీఛార్జ్‌లపై 5% క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. స్విగ్గి, ఓలా, జొమాటో లావాదేవీలపై 4% క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. అన్ని ఇతర ఖర్చులపై 1.5% క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. ఖర్చుల ఆధారంగా సంవత్సరానికి 4 కాంప్లిమెంటరీ డొమెస్టిక్ లాంజ్ విజిట్స్ ఉంటాయి. పెట్రోల్ బంకుల్లో రూ.400 నుంచి రూ.4,000 మధ్య ఫ్యూయల్ కొట్టించుకుంటే 1% ఫ్యూయెల్ సర్‌ఛార్జ్ మినహాయింపు లభిస్తుంది.

క్యాష్‌బ్యాక్ SBI కార్డ్

ఈ క్రిడెట్‌ కార్డ్ పొందాలంటే కస్టమర్లు జాయినింగ్ ఫీజు రూ.999, యాన్యువల్ ఛార్జీగా అంతే మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ షాపింగ్ కోసం క్యాష్‌బ్యాక్ SBI కార్డ్ వాడితే, ఎలాంటి పరిమితులు లేకుండా అన్ని రకాల ఆన్‌లైన్ ఖర్చులపై 5% క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. ఆఫ్‌లైన్ ట్రాన్సాక్షన్‌పై ఫ్లాట్ 1% క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. పెట్రోల్ పంపుల వద్ద 1% ఫ్యూయల్ సర్‌ఛార్జ్ మినహాయింపు ఉంటుంది. అయితే రూ.500 నుంచి రూ.3,000 మధ్య జరిగే ఫ్యూయల్ లావాదేవీలపై మాత్రమే ఇది వర్తిస్తుంది. అలాగే మునుపటి సంవత్సరంలో రూ. 2 లక్షల ఖర్చు చేస్తే, యాన్యువల్ ఫీజు మినహాయింపు ఉంటుంది.

HDFC మనీబ్యాక్+ క్రెడిట్‌కార్డ్

HDFC మనీబ్యాక్+ క్రెడిట్‌కార్డ్ కోసం జాయినింగ్ ఫీజు, యాన్యువల్ ఛార్జీగా రూ.500 చొప్పున చెల్లించాలి. కస్టమర్లు ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, స్విగ్గీ, రిలయన్స్ స్మార్ట్ సూపర్‌స్టోర్, బిగ్ బాస్కెట్ లో కొనుగొళ్లపై 10X క్యాష్‌పాయింట్‌లను పొందవచ్చు. EMI ఖర్చులపై 5X క్యాష్‌పాయింట్‌లు లభిస్తాయి. ఇతర కేటగిరీల్లో (ఇంధనం, వాలెట్ రీలోడ్, ప్రీపెయిడ్ కార్డ్ లోడ్స్, వోచర్ కొనుగోళ్లు మినహా) ఖర్చు చేసిన ప్రతి రూ.150కి 2 క్యాష్‌పాయింట్స్ లభిస్తాయి. అలాగే 500 క్యాష్‌పాయింట్స్ యాక్టివేషన్ ప్రయోజనం పొందవచ్చు. రూ.400 నుంచి రూ. 5,000 వరకు ఫ్యూయల్ లావాదేవీలపై 1% ఇంధన సర్‌ఛార్జ్ మినహాయింపు లభిస్తుంది.

* HDFC మిలీనియా క్రెడిట్ కార్డ్

ఈ క్రెడిట్‌ కార్డ్ పొందాలంటే జాయింగ్ ఫీజుగా రూ.1000, యాన్యువల్ ఫీజుగా అంతే మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. ఈ కార్డుపై ప్రతి క్యాలెండర్ త్రైమాసికంలో కనీసం లక్ష రూపాయలు ఖర్చు చేస్తే, రూ.1,000 గిఫ్ట్ వోచర్ లభిస్తుంది. అమెజాన్, బుక్ మైక్ షో, కల్ట్.ఫిట్, ఫ్లిప్‌కార్ట్, మింత్రా, సోని లివ్, స్విగ్గి, ఉబెర్, జొమాటో వంటి వాటిలో ఏదైనా ఆర్డర్ చేస్తే 5% క్యాష్‌బ్యాక్ ఉంటుంది. EMI, వాలెట్ లావాదేవీలతో సహా ఇతర ఖర్చులపై (ఇంధనం మినహా) 1% క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. త్రైమాసికంలో రూ.లక్ష ఖర్చు చేస్తే సంవత్సరానికి 4 కాంప్లిమెంటరీ డొమెస్టిక్ లాంజ్ విజిట్స్ ఉంటాయి. రూ. 400 నుంచి రూ.5,000 వరకు ఫ్యూయల్ లావాదేవీలపై 1% ఇంధన సర్‌ఛార్జ్ మినహాయింపు ఉంటుంది. దీని ద్వారా నెలకు రూ.250 వరకు ఆదా చేయవచ్చు.


bottom of page