టీమిండియా దెబ్బకు దెబ్బ తీసింది. మొదటి టెస్టులో చిత్తుగా ఓడించిన దక్షిణాఫ్రికాపై ప్రతీకారం తీర్చుకుంది. కేప్ టౌన్ వేదికగా రెండు రోజుల్లోపే ముగిసిన రెండో టెస్టులో భారత జట్టు 7 వికెట్ల తేడాతో ఆతిథ్య జట్టును చిత్తు చేసింది.
టీమిండియా దెబ్బకు దెబ్బ తీసింది. మొదటి టెస్టులో చిత్తుగా ఓడించిన దక్షిణాఫ్రికాపై ప్రతీకారం తీర్చుకుంది. కేప్ టౌన్ వేదికగా రెండు రోజుల్లోపే ముగిసిన రెండో టెస్టులో భారత జట్టు 7 వికెట్ల తేడాతో ఆతిథ్య జట్టును చిత్తు చేసింది. తద్వారా రెండు టెస్ట్‌ల సిరీస్‌ను రోహిత్ సేన సమం చేసింది. రెండో ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా విధించిన 79 పరుగుల లక్ష్యాన్ని 3వికెట్లు కోల్పోయి ఛేదించింది రోహిత్ సేన. యశస్వి జైస్వాల్ (28), శుభమన్ గిల్ (10), విరాట్ కోహ్లీ (12) పరుగులు చేసి ఔట్ కాగా కెప్టెన్ రోహిత్ శర్మ (17), శ్రేయస్ అయ్యర్ (4) మిగతా పనిని పూర్తి చేశారు. ఈ మైదానంలో భారత జట్టు టెస్ట్ మ్యాచ్ గెలవడం ఇదే తొలిసారి. ఈ విజయంతో ధోనీ తర్వాత సఫారీ గడ్డపై సిరీస్ కోల్పోని రెండో కెప్టెన్‌గా రోహిత్ ఘనత సాధించాడు. 🏆🎉