top of page
Suresh D

పింక్ జెర్సీలతో టీమిండియాను ఢీ కొట్టనున్న దక్షిణాఫ్రికా జట్టు..

భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో మొదటి మ్యాచ్ డిసెంబర్ 17న జోహన్నెస్‌బర్గ్‌లో జరగనుంది. 2వ మ్యాచ్ డిసెంబర్ 19న గెబ్బాగ్‌లో జరగనుంది.

భారత్‌తో జరిగే తొలి వన్డే మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా (South Africa) జట్టు రెగ్యూలర్ జెర్సీని విడిచిపెట్టింది. పింక్ జెర్సీ (Pink Jersey)తో బరిలోకి దిగనుంది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా నేడు జోహన్నెస్‌బర్గ్ వేదికగా తొలి మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా ఆటగాళ్లు తమ సాంప్రదాయ పసుపు-ఆకుపచ్చ జెర్సీలకు బదులుగా పింక్ యూనిఫామ్‌లో కనిపించనున్నారు.

దక్షిణాఫ్రికా జట్టు ప్రతి సంవత్సరం పింక్ డేని సెలబ్రేట్ చేస్తుంది. దీని ముఖ్య ఉద్దేశం బ్రెస్ట్ క్యాన్సర్‌పై అవగాహన కల్పించనుంది. అదనంగా, వారు విద్య, పరిశోధనలకు తమ మద్దతును తెలియజేస్తారు.

దక్షిణాఫ్రికా జట్టు ఈ ప్రచారంలో పాల్గొనేందుకు ప్రేక్షకులు కూడా పింక్ డ్రెస్‌లో స్టేడియానికి వస్తారు. అలాగే, ఈ మ్యాచ్ ద్వారా వచ్చే మొత్తం రొమ్ము క్యాన్సర్ సంబంధిత కార్యక్రమాలకు ఖర్చు చేయనుంది.

దక్షిణాఫ్రికాతో జరిగే పింక్ జెర్సీ మ్యాచ్‌లో టీమిండియా తరపున విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ కనిపించరు. ఈ ఇద్దరు ఆటగాళ్లకు దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌ నుంచి విశ్రాంతినిచ్చారు. తద్వారా భారత జట్టుకు కేఎల్ రాహుల్ నాయకత్వం వహించనున్నాడు.

విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ గైర్హాజరీలో రుతురాజ్ గైక్వాడ్, తిలక్ వర్మ, రజత్ పటీదార్, సాయి సుదర్శన్ వంటి వర్ధమాన ప్రతిభావంతులకు అవకాశం దక్కే అవకాశం ఉంది.

దక్షిణాఫ్రికా జట్టు: రీజా హెండ్రిక్స్, టోనీ డి జోర్జి, రాస్సీ వాన్ డెర్ డస్సెన్, ఐడెన్ మార్క్‌రామ్ (కెప్టెన్), హెన్రిక్ క్లాసెన్ (వికెట్ కీపర్), డేవిడ్ మిల్లర్, ఆండిలే ఫెహ్లుక్వాయో, కేశవ్ మహారాజ్, నాండ్రే బెర్గెర్, తబ్రేజ్ షమ్సీ, లిజార్డ్ విలియమ్స్, వియాన్ ముల్డర్, ఒత్నియెల్ బార్ట్‌మాన్, మిహ్లాలీ మ్పోంగ్వానా, కైల్ వెర్రెన్నే.

భారత జట్టు: రజత్ పాటిదార్, సాయి సుదర్శన్, సంజు శాంసన్, శ్రేయాస్ అయ్యర్, KL రాహుల్ (కెప్టెన్), రింకూ సింగ్, అక్షర్ పటేల్, అవేష్ ఖాన్, కుల్దీప్ యాదవ్, ముఖేష్ కుమార్, యుజ్వేంద్ర చాహల్, తిలక్ వర్మ, రుతురాజ్ గైక్వాడ్, వాషింగ్టన్ సుందర్, అర్షదీప్ సింగ్, ఆకాష్ దీప్.

bottom of page