top of page
Suresh D

తొలిసారి మిస్‌ యూనివర్స్‌ పోటీలో సౌదీ అరేబియా బ్యూటీ.. 💃

ఇస్లామిక్‌ దేశాలలో సౌదీ అరేబియా అత్యంత సంపన్న దేశం. ఈ దేశం నుంచి ఇప్పటి వరకు ఒక్క మహిళ కూడా అందాల పోటీల్లో పాల్గొన్న దాఖలాలు లేవు.

అయితే ఫ్యాషన్‌ రంగంలో ఎంతో ప్రతిష్ఠాత్మంగా భావించే మిస్‌ యూనివర్స్‌ 2024 అందాల పోటీలకు తొలిసారి సౌదీ అరేబియా పోటీ చేయనుంది. దీంతో సౌదీ అరేబియావైపు ప్రపంచ దేశాలన్నీ తొంగి చూస్తున్నాయి. ఈ దేశానికి రూమీ అల్కహ్తాని (27) అనే మోడల్‌ ప్రాతినిధ్యం వహిస్తోంది. ఈ విషయాన్ని తాజాగా ఈ అందాల భామ తన సోషల్‌ మీడియా ఖాతా ద్వారా  వెల్లడించింది. దీంతోపాటు రూమీ అల్కహ్తాని తన గ్లామరస్‌ ఫొటోలను కూడా షేర్‌ చేసింది. ‘మిస్ యూనివర్స్ 2024 పోటీలో పాల్గొనడం నాకు గర్వంగా ఉంది. మిస్ యూనివర్స్ పోటీలో సౌదీ అరేబియా మొదటిసారి పాల్గొంటోంది’అని తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో అరబిక్‌లో రాసింది. దీంతో అంతర్జాతీయ వేదికగా జరిగే ఓ అందాల పోటీల్లో పాల్గొనే తొలి సౌదీ యువతిగా రూమీ అల్కహ్తాని చరిత్ర సృష్టించనుంది.కాగా 73వ మిస్‌ యూనివర్స్‌ పోటీలు ఈ ఏడాది సెప్టెంబర్‌ 28 మెక్సికో వేధికగా నిర్వహించనున్నారు. 

bottom of page