top of page

టాలీవుడ్ ఇండస్ట్రీలో విషాదం..

కిడ్నీస్ ఫెయిల్యూర్, బ్లడ్ ఇన్ఫెక్షన్ తో కొన్ని నెలలుగా చెన్నైలోనే ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. వైద్యుల సూచనతో కొన్ని రోజుల క్రితం హైదరాబాద్‌ ఏఐజీ ఆస్పత్రికి మార్చారు. వైద్యుల నిరంతర పర్యవేక్షణలో వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తూ వచ్చారు. అయినా ఆయన కోలుకోలేకపోయారు.


హీరోగానే కాదు.. విలన్‏గానూ మెప్పించిన శరత్ బాబు..

మరో చరిత్ర, గుప్పెడు మనసు, ఇది కథ కాదు, తాయారమ్మా బంగారయ్యా… మూడు ముళ్ల బంధం, సీతాకోక చిలుక, స్వాతిముత్యం, జీవనజ్యోతి… అభినందన, స్వాతిచినుకులు, ఆపద్బాంధవుడు, నువ్వు లేక నేను లేను… శంకర్‌దాదా జిందాబాద్‌, శ్రీరామదాసు, ఆట, శౌర్యం, సాగరసంగమం… షిరిడిసాయి, ఎంత మంచివాడవురా, వకీల్‌ సాబ్‌ చిత్రాల్లోని పాత్రలకు మంచి గుర్తింపుదక్కింది. హీరోయిన్లకు సోదరుడిగా, మధ్యతరగతి మనిషిగా, ప్రలోభాలకు గురైన వ్యక్తిగా, హీరోకి స్నేహితుడిగా, ప్రతినాయకుడిగా, సిట్చువేషన్స్ కి తగ్గట్టు ప్రవర్తించే వ్యక్తిగా ఎన్నో రకాల పాత్రల్లో మెప్పించారు శరత్‌బాబు. 250కిపైగా సినిమాలు.. అతనే ఓ ఆల్ రౌండర్..

శరత్‌బాబు పూర్తి పేరు సత్యంబాబు దీక్షితులు. 1951 జులై 31న ఆమదాలవలసలో జన్మించారు. 1973లో రామరాజ్యంతో సినీ రంగ ప్రవేశం చేశారు శరత్‌బాబు. తెలుగు, తమిళ్‌, కన్నడ, మలయాళం, హిందీల్లో దాదాపు 250కి పైగా సినిమాలు చేశారు. కేవలం హీరోగానే కాకుండా.. అనేక పాత్రలలో కనిపించి మెప్పించారు. శరత్ బాబు కన్నుమూత.. ఎన్నో వైవిధ్యమైన పాత్రలు చేసి.. సినీప్రియులను అలరించిన అలనాటి నటుడు శరత్‌బాబు... తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ సోమవారం మధ్యాహ్నం కన్నుమూశారు.. కిడ్నీ ఫెయిల్యూర్‌తో పాటు.. లంగ్స్ ఇష్యూతోనూ ఇబ్బంది పడుతున్న ఆయన కొంత కాలంగా చెన్నైలో చికిత్స తీసుకుంటున్నారు. అయితే పరిస్థితి విషమించడంతో... వైద్యుల సూచన ప్రకారం ఈ నెల 20న హైదరాబాద్‌లోని AIG హాస్పిటల్స్‌కు శరత్‌బాబును షిఫ్ట్‌ చేశారు. గత కొద్ది రోజులుగా ఏఐజీ హాస్పిటల్‏లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న హీరో శరత్ బాబు సోమవారం మధ్యాహ్నం కన్నుమూశారు. కిడ్నీస్ ఫెయిల్యూర్, బ్లడ్ ఇన్ఫెక్షన్ తో కొన్ని నెలలుగా చెన్నైలోనే ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. వైద్యుల సూచనతో కొన్ని రోజుల క్రితం హైదరాబాద్‌ ఏఐజీ ఆస్పత్రికి మార్చారు. వైద్యుల నిరంతర పర్యవేక్షణలో వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తూ వచ్చారు. అయినా ఆయన కోలుకోలేకపోయారు. సుమారు నెల రోజుల పాటు మృత్యువుతో పోరాడిన ఆయన సోమవారం మధ్యాహ్నం కన్నుమూశారు. శరత్ బాబు మృతి పట్ల సినీ ప్రముఖులు తీవ్ర దిగ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.

Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page