top of page

🏍️ బైక్‌పై బండి సంజయ్ సుడిగాలి పర్యటన..

👨‍🦳 పెద్ద ఎత్తున యువత బండి సంజయ్ వెంట రాగా వారితో కలిసి కలియ తిరిగారు. ఉదయం ప్రారంభమైన గణేష్ మండపాల సందర్శన రాత్రి పొద్దుపోయే వరకు కొనసాగింది.

సాయంత్రం 6 గంటల సమయానికి దాదాపు 200కు పైగా గణేష్ మండపాలను బండి సంజయ్ సందర్శించారు. ఒకవైపు గణనాథులను దర్శించుకుంటూనే మరోవైపు యువతతో కలిసి సెల్ఫీలు దిగుతూ.. స్థానికుల సమస్యలు వింటూ.. వాటి పరిష్కారానికి భరోసానిస్తూ ముందుకు సాగారు.

🌙 రాత్రి పొద్దు పోయే వరకు కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని వివిధ వార్డుల్లో బండి సంజయ్ పర్యటనను కొనసాగించేలా ఆయన ముందుగానే ఈ రోజు కోసం షెడ్యూల్ రూపొందించారు. ఈ రోజు సాయంత్రం 6 గంటల సమయానికి 10 డివిజన్లలో సుడిగాలి పర్యటన చేసిన బండి సంజయ్ రాత్రి పొద్దు పోయే వరకు మరో 6 డివిజన్లలో పర్యటించి మరో వంద గణేష్ మండపాలను సందర్శించేలా షెడ్యూల్ రూపొందించుకొని, పర్యటనను కొనసాగించారు. 🏞️🚴‍♂️📸

Σχόλια


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page