దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్ మేజర్ శాంసంగ్ (Samsung) భారత్ మార్కెట్లోకి ఈ నెల ఏడో తేదీన తన శాంసంగ్ గెలాక్సీ ఎం34 5జీ (Samsung Galaxy M34 5G) ఫోన్ ఆవిష్కరించనున్నది. 6,000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతోపాటు 50-మెగా పిక్సెల్స్ కెమెరాతో అందుబాటులోకి వస్తున్నది శాంసంగ్ గెలాక్సీ ఎం34 5జీ (Samsung Galaxy M34 5G).
దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్ మేజర్ శాంసంగ్ (Samsung) భారత్ మార్కెట్లోకి ఈ నెల ఏడో తేదీన తన శాంసంగ్ గెలాక్సీ ఎం34 5జీ (Samsung Galaxy M34 5G) ఫోన్ ఆవిష్కరించనున్నది. 6,000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతోపాటు 50-మెగా పిక్సెల్స్ కెమెరాతో అందుబాటులోకి వస్తున్నది శాంసంగ్ గెలాక్సీ ఎం34 5జీ (Samsung Galaxy M34 5G).లాంచ్ కానున్న శాంసంగ్ ఫోన్‌పై లీకులొచ్చాయి. 6.5-అంగుళాల ఫుల్ HD AMOLED డిస్‌ప్లే ఉంటుంది. శాంసంగ్ ఇన్‌హౌస్ చిప్, Exynos 1280 ద్వారా పవర్ అందిస్తుంది. 8GB/128 GB మోడల్‌ను కలిగి ఉంటుంది.అయితే శాంసంగ్ MediaTek Dimensity 1080 చిప్‌సెట్‌ని ఎంచుకోవచ్చని నివేదికలు పేర్కొన్నాయి. ఇప్పటికే Galaxy A34తో చేసింది. ఫోన్ ట్రిపుల్-కెమెరా సెటప్ 50MP, 8MP, 2MP సెన్సార్లను కలిగి ఉంటుందని నివేదిక పేర్కొంది.బ్రార్ ట్వీట్ ప్రకారం.. సెల్ఫీ కెమెరా 13MP ఉంటుంది. ఈ డివైజ్ 13లో రన్ అవుతుందని, 4K వీడియో రికార్డింగ్‌కు కూడా సపోర్టు ఇస్తుందని భావిస్తున్నారు. ఈ ఫోన్ 25W ఛార్జింగ్‌కు కూడా సపోర్టు ఇస్తుందని బ్రార్ తెలిపారు. ధర విషయానికి వస్తే.. ఈ ఫోన్ ధర రూ.18వేల నుంచి రూ.19వేల మధ్య ఉంటుందని బ్రార్ చెప్పారు.
ఈ ఫోన్ భారత మార్కెట్లో ఎక్కడో రూ. 21వేల నుంచి రూ. 24వేల వరకు ఉంటుంది. ఈ ఫోన్ రెండు వేరియంట్‌లను లాంచ్ చేయనుందని, అందులో 6GB RAM, మరొకటి 8GB RAMతో ఉంటుందని తెలిపారు.