top of page
Suresh D

AI ఆధారిత ల్యాప్‌టాప్‌ను విడుదల చేసిన శాంసంగ్

ప్రముఖ ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తుల తయారీ సంస్థ శాంసంగ్‌.. తన కొత్త ల్యాప్‌టాప్‌ శాంసంగ్‌ గెలాక్సీ బుక్‌ 4ను భారత మార్కెట్‌లో లాంచ్ చేసింది. ఈ సంస్థ ఇప్పటికే గెలాక్సీ బుక్‌4 సిరీస్‌లో బుక్‌4 ప్రో, బుక్‌4 ప్రో 360లను తీసుకొచ్చింది. ఫొటో రీమాస్టరింగ్‌, వీడియో ఎడిటింగ్‌ లాంటి ఏఐ టూల్స్‌తో పాటు మరో వినూత్న ఫీచర్‌ను ఇందులో జోడించింది. ఇంటెల్‌ కోర్‌ 5 ప్రాసెసర్‌+ 8GB ర్యామ్‌ వేరియంట్‌ ల్యాప్‌టాప్‌ ధర రూ.70,990గా కంపెనీ పేర్కొంది. ఇప్పటికే వీటి విక్రయాలు ప్రారంభమయ్యాయని, కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌, ఆన్‌లైన్‌ స్టోర్లతో పాటు ఇతర రిటైల్‌ స్టోర్ల ద్వారా కొనుగోలు చేయొచ్చని శాంసంగ్‌ తెలిపింది.


bottom of page