నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత సమంత కెరీర్ పరంగా మరింత జోరు చూపిస్తున్న సంగతి తెలిసిందే. కేవలం సౌత్ లోనే కాకుండా నార్త్ లోనూ నటిస్తూ బిజీ షెడ్యూల్ ను మెయింటైన్ చేస్తోంది.అయితే ఇప్పుడు ఈ బ్యూటీ కొత్త టెన్షన్ పట్టుకుంది. బాలీవుడ్ లో సమంత `సిటాడెల్` అనే వెబ్ సిరీస్ చేస్తున్న సంగతి తెలిసిందే.
మోస్ట్ టాలెంటెడ్ అయిన రాజ్ డీకే ఈ వెబ్ సిరీస్ ను డైరెక్ట్ చేస్తున్నారు. ఇందులో బాలీవుడ్ స్టార్ వరుణ్ ధావన్, సమంత జంటగా నటిస్తున్నారు. ఇదొక స్పై థ్రిల్లర్ వెబ్ సిరీస్. ఆల్మోస్ట్ షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సిరీస్ త్వరలోనే ప్రముఖ దిగ్గజ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ఆమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవ్వబోతోంది. హాలీవుడ్ లో రూసో బ్రదర్స్ దర్శకత్వంలో ప్రియాంక చోప్రా, రిచర్డ్ మాడెన్ జంటగా నటించిన `సిటాడెల్`కు ఇది ఇండియన్ వెర్షన్ అన్న సంగతి తెలిసిందే. అయితే ప్రియాంక చోప్రా, రిచర్డ్ మాడెన్ నటించిన `సిటాడెల్` కొద్ది రోజుల క్రితం అమోజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అయింది. హాలీవుడ్ తో పాటు భారతీయ భాషల్లోనూ ఈ వెబ్ సిరీస్ ను రిలీజ్ చేశారు. తెలుగులో కూడా చాలా మంది చూసేశారు. కానీ, ఈ సిరీస్ ప్రేక్షకులను తీవ్రంగా నిరాశ పరిచింది. యాక్షన్ తరహా స్టోరీతోనే ఈ సిరీస్ ను తెరకెక్కించినా.. ఆడియెన్స్ మెప్పు పొందలేకపోయింది...దాదాపు 250 మిలియన్ డాలర్స్ తో ఈ వెబ్ సిరీస్ ను రూపొందించారు. అంటే ఇండియన్ కరెన్సీలో రూ. 2000 కోట్లు సిటాడెల్ కోసం ఖర్చు పెట్టాడు. ఇప్పుడు ఆ రెండు వేల కోట్లు బూడిదలో పోసిన పన్నీరే అయింది. ప్రైమ్‌లో ఈ సిరీస్ అనుకున్న స్థాయిలో ఆదరణ దక్కలేదు. దీంతో సమంతకు టెన్షన్ పట్టుకుంది. ఒరిజినల్ సిరీసే మన దగ్గర ఆడలేదు.. అలాంటప్పుడు ఇండియన్ వెర్షన్ పేరిట పలు మార్పులు చేర్పులు చేసి తెరకెక్కిస్తే మాత్రం సమంత `సిటాడెల్`ను ప్రేక్షకులు ఆధరిస్తారా అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ నేపథ్యంలోనే అనవసరంగా సమంత `సిటాడెల్`కు సైన్ చేసిందని.. ఆమె కష్టం మొత్తం వృథా అవ్వడం ఖాయమని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు.