top of page
MediaFx

సమంత బ్రేక్ ఇంకా ఎన్నాళ్లు.? గ్యాప్ ఎందుకు.?


సమంతకు ఏమైంది..? ఎక్కడుంది..? సినిమాలు ఎందుకు చేయట్లేదు..? అవకాశాలు రావట్లేదా..? వచ్చినా కూడా వద్దనుకుంటున్నారా..? అసలేంటి సమంత ప్లాన్..? తెలుగు సినిమాలు మాత్రమే చేయట్లేదా లేదంటే హిందీలో కూడా ఇదే సమాధానం చెప్తున్నారా..? 

సమంత బ్రేక్ ఇంకా ఎన్నాళ్లు..? మళ్లీ ఆమెను వరసగా సినిమాల్లో చూసేదెప్పుడు..? ఏదో అనుకున్నాం కానీ సమంత దూకుడు అడ్డుకోవడం అంత ఈజీ కాదు బాసూ..! మిగిలిన హీరోయిన్లతో పోలిస్తే ఈమెలో ఏదో సమ్‌థింగ్ స్పెషల్ ఉంది. 

అందుకే ఇప్పటికీ ఆఫర్స్ అలా క్యూ కడుతున్నాయి. టాలీవుడ్ టూ బాలీవుడ్ సమంతతో నటించడానికి హీరోలు పోటీ పడుతున్నారు. కానీ ఈమె మాత్రం ఏ సినిమాకు ఓకే చెప్పట్లేదు. ఏడాది నుంచి ఖాళీగానే ఉన్నారు స్యామ్. 

విడాకుల తర్వాత కాస్త జోరు తగ్గించినట్లు అనిపించినా.. ది ఫ్యామిలీ మ్యాన్ 2 తర్వాత మళ్లీ స్యామ్ కెరీర్‌కు రెక్కలొచ్చాయి. మధ్యలో మయోసైటిస్ ఇబ్బంది పెట్టినా.. తగ్గేదే లే అంటూ హాలీవుడ్ వరకు స్యామ్ జర్నీ సాగుతూ ఉంది. ఖుషీ తర్వాత తెలుగు సినిమాలేవీ ఒప్పుకోలేదు ఈ భామ. రెండు సినిమాలకు కమిటైనా.. నిర్మాతలకు అడ్వాన్సులు కూడా తిరిగిచ్చేసినట్లు తెలుస్తుంది. 

బాలీవుడ్‌లోనూ అప్పుడెప్పుడో ఒప్పుకున్న సిటాడెల్ వెబ్ సిరీస్ పూర్తి చేసారు సమంత.. తర్వాత మళ్లీ కనిపించలేదు. సోషల్ మీడియాలోనూ ముందులా యాక్టివ్ లేరు స్యామ్. ఎప్పుడో నెలకు రెండు మూడు ఫోటోషూట్స్ పెట్టి చేతులు దులిపేసుకుంటున్నారు. కానీ ఫోటోషూట్స్‌లో మాత్రం అందాల ఆరబోతతో పిచ్చెక్కిస్తున్నారు సమంత.

bottom of page