top of page
Suresh D

విడాకుల తర్వాత మొదటి సారి ఒకే ఈవెంట్‌లో సమంత, నాగ చైతన్య..🎥✨

ఒకప్పుడు టాలీవుడ్ క్యూట్ కపుల్ గా పేరొందిన సమంత , నాగ చైతన్య విడాకులు తీసుకుని రెండున్నరేళ్లు దాటింది. ఇప్పుడు కూడా వారిద్దరూ కలిసిపోతే చూడాలనుకున్న అభిమానులు చాలామందే ఉన్నారు. విడాకుల తర్వాత ఇద్దరూ మళ్లీ సినిమాల్లో బిజీ అయిపోయారు. కాగా సమంత, నాగ చైతన్య ఇద్దరూ ఒకే రంగంలో పనిచేస్తున్నారు. కాబట్టి ఏదో ఒక సందర్భంలో ఒకరినొకరు ఎదుర్కోవాల్సి రావడం అనివార్యం. ఈరోజు (మార్చి 19) ముంబైలో జరిగిన ఓ కార్యక్రమానికి సమంత , నాగచైతన్య ఇద్దరూ హాజరయ్యారు. అయితే ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. ఇద్దరూ ఒకే ఈవెంట్ కు వచ్చినా వేదికపైకి మాత్రం వేర్వేరు సందర్భాల్లో వచ్చారు. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్‌ ‘అమెజాన్ ప్రైమ్ వీడియో’తో సమంత, నాగ చైతన్య చేతులు కలిపారు. నాగ చైతన్య నటించిన ‘ధూత’ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలై సూపర్ హిట్ అయింది. అదేవిధంగా సమంత నటించిన ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ కూడా అదే OTTలో భారీ వ్యూస్ సొంతం చేసుకుంది. ఇప్పుడు సమంత నటించిన ‘సిటాడెల్ హనీ బానీ’ కూడా ‘అమెజాన్ ప్రైమ్ వీడియో’ లోనే స్ట్రీమింగ్ కానుంది.🎥✨

bottom of page