top of page

విరాట్ కోహ్లీ నాకు స్ఫూర్తి ఆ రోజు ఏడ్చేశాను...

సమంత తాజా ఇంటర్వ్యూలో ఆసక్తికర కామెంట్స్ చేశారు. తనకు క్రికెటర్ విరాట్ కోహ్లీ స్ఫూర్తి అన్న ఆమె ఓ రోజు గట్టిగా ఏడ్చేశానని చెప్పుకొచ్చారు.

సమంత-విజయ్ దేవరకొండ జంటగా నటించిన ఖుషి మూవీ సెప్టెంబర్ 1న విడుదల కానుంది. నెలల ముందే ప్రమోషన్స్ షురూ చేశారు. ఈ సందర్భంగా విజయ్, సమంత స్టార్ స్పోర్ట్స్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. తమకు ఇష్టమైన గేమ్స్, ప్లేయర్స్, వాళ్ళ స్పోర్ట్స్ బ్యాక్ గ్రౌండ్స్... ఇలా అనేక విషయాలు పంచుకున్నారు.కాగా సమంత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ పట్ల అభిమానం చాటుకున్నారు. విరాట్ నాకు స్ఫూర్తి అని చెప్పుకొచ్చారు. ఒక దశలో విరాట్ ఫార్మ్ కోల్పోయి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. ఆయనపై ముప్పేట దాడి జరిగింది. అప్పుడు ఒక భారీ సెంచరీ చేసి కమ్ బ్యాక్ ప్రకటించారు. ఆ చారిత్రాత్మక 71వ సెంచరీ నాకు ఎంతో స్పెషల్. ఆ రోజు నేను ఏడ్చేశాను, అని సమంత అన్నారు. అలాగే ధోని అంటే కూడా తనకు ఇష్టమని సమంత చెప్పుకొచ్చారు. ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తన ఫేవరెట్ అన్నారు. సమంత విరాట్ కోహ్లీపై చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.ఇక ఖుషి విషయానికి వస్తే యూత్ఫుల్ రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతుంది. దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ఇటీవల సమంత లుక్ విడుదల చేయగా ఆకట్టుకుంది. చాలా కాలం తర్వాత సమంత ఈ తరహా సబ్జెక్టు చేస్తున్నారు. ఖుషి పోస్టర్ ఆమె డెబ్యూ మూవీ ఏమాయ చేశావే చిత్రాన్ని తలపిస్తున్నాయి. ఖుషి చిత్ర విజయం మీద యూనిట్ విశ్వాసంతో ఉన్నారు. విజయ్ దేవరకొండ ఖుషి చిత్ర విజయం చాలా అవసరం. ఆయన సక్సెస్ కొట్టి చాలా కాలం అయిపోతుంది.


Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page