పిల్లలతో సరదాగా గడిపిన క్షణాలను ఇన్ స్టాలో పోస్ట్ చేస్తూ.. “ఒక పుస్తకం, ఒక పెన్, ఒక స్టూడెంట్, ఒక టీచర్ మాత్రమే ఈ ప్రపంచాన్ని మార్చగలవు.
ఏకమ్. మేము మంచి చేశాము” అంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం సామ్ చేసిన పోస్ట్ నెట్టింట వైరలవుతుండగా.. నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. అలాగే చాలా కాలం తర్వాత సామ్ న్యూ అండ్ స్టైలీష్ లుక్ ఫ్యాన్స్ కు ఆకట్టుకుంది. నీలిరంగు చారల సూట్.. ముదురు డెనిమ్ జీన్స్ తోపాటు..🎬👏 స్లీవ్స్ పై తెల్లటి చారలు.. ప్రతివైపు మూడు గోల్డ్ బటన్స్ తో కత్తిరించిన షార్ట్ బ్లేజర్ ధరించి .. చిన్న హ్యారీకట్‌ను స్పోర్ట్ చేస్తూ.. స్టైలిష్ సన్ గ్లాసెస్‌తో మరింత అందంగా కనిపించింది. ప్రస్తుతం సామ్ న్యూలుక్ ఫోటోస్ సైతం వైరలవుతున్నాయి. ఇదిలా ఉంటే.. సామ్ చివరిసారిగా ఖుషి చిత్రంలో నటించింది. డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ హీరోగా నటించారు. ఈ మూవీకి అడియన్స్ నుంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఆ తర్వాత బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ జోడిగా సిటాడెల్ వెబ్ సిరీస్ చేసింది. వచ్చే ఏడాదిలో ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. అయితే కొన్నాళ్లుగా మయోసైటిస్ సమస్యతో బాధపడుతున్న సామ్.. ఇప్పుడు సినిమాలకు బ్రేక్ ఇచ్చి పూర్తిగా ఆరోగ్యం పై దృష్టి పెట్టింది. అలాగే ఆమె చెన్నై స్టోరీస్ సినిమాతో హాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టబోతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని ఇంగ్లీష్, తమిళ్ ద్విభాషా చిత్రంగా రూపొందిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ ప్రకటన రానుంది.