top of page

వ‌సూళ్ల మోత మోగిస్తూన్న సామజవరాగమనా 🎥💰🚶‍♀️.

సామ‌జ‌వ‌ర‌గ‌మ‌న అనే చిన్న సినిమా వారం రోజుల నుంచి బాక్సాఫీస్ ద‌గ్గ‌ర రేపుతున్న సంచ‌లనం గురించి అంద‌రికీ తెలిసిందే. చిన్న సినిమాల‌కు ప్రేక్ష‌కుల‌ను ఓ మోస్త‌రుగా కూడా థియేట‌ర్ల‌కు ర‌ప్పించ‌డం చాలా క‌ష్ట‌మైపోతున్న ఈ రోజుల్లో అప్పుడ‌ప్పుడూ కొన్ని సినిమాలు ఇర‌గాడేస్తుంటాయి.

సామ‌జ‌వ‌ర‌గ‌మ‌న అనే చిన్న సినిమా వారం రోజుల నుంచి బాక్సాఫీస్ ద‌గ్గ‌ర రేపుతున్న సంచ‌లనం గురించి అంద‌రికీ తెలిసిందే. చిన్న సినిమాల‌కు ప్రేక్ష‌కుల‌ను ఓ మోస్త‌రుగా కూడా థియేట‌ర్ల‌కు ర‌ప్పించ‌డం చాలా క‌ష్ట‌మైపోతున్న ఈ రోజుల్లో అప్పుడ‌ప్పుడూ కొన్ని సినిమాలు ఇర‌గాడేస్తుంటాయి. త‌మ స్థాయికి మించిన వ‌సూళ్లు రాబ‌డుతుంటాయి.సామ‌జ‌వ‌ర‌గ‌మ‌న అలాగే వ‌సూళ్ల మోత మోగిస్తూ సాగిపోతోంది. వారం తిరిగేస‌రికి 30 కోట్ల గ్రాస్.. దాదాపు 20 కోట్ల షేర్ అంటే చిన్న విష‌యం కాదు. మంచి టాక్‌కు తోడు బాక్సాఫీస్ ప‌రిస్థితులు కూడా ఈ సినిమాకు బాగా క‌లిసొచ్చాయి. గ‌త వారం దీనికి పోటీగా రిలీజైన సినిమాలేవీ నిల‌బ‌డ‌క‌పోవ‌డంతో అడ్వాంటేజ్‌ను బాగా ఉప‌యోగించుకుంది. రెండో వారంలో కూడా ఈ సినిమాకు భ‌లేగా క‌లిసొస్తోంది. వీక్ డేస్‌లో కొంచెం స్లో అయిన సామ‌జ‌వ‌ర‌గ‌మ‌న‌.శుక్ర‌వారం సాయంత్రం షోల నుంచి మ‌ళ్లీ బ‌లంగా పుంజుకుంది.

Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page