top of page

పెరుగులో ఉప్పు లేదా చక్కెర..ఏది వేసుకుని తింటే మంచిది?


ఉప్పుతో తింటే..

పెరుగును ఉప్పుతో కలిపి తీసుకుంటే చాలా మంచిది. అందులోనూ పెరుగులో పింక్ సాల్ట్ లేదా బ్లాక్ సాల్ట్ వేసుకుని తింటే ఇంకా బెటర్. డయాబెటీస్ ఉన్నవారు పొరపాటున కూడా పెరుగులో చక్కెర వేసుకుని తినకూడదు. రక్త పోటు ఉన్నవారు పెరుగులో ఉప్పు కలిపి తీసుకోవచ్చు. అయితే పెరుగులో ఉప్పు కలిపి తీసుకుంటే.. పెరుగులో ఉండే గుడ్ బ్యాక్టీరియా నశిస్తుంది. ఉప్పు ఎక్కువ వేసుకుని తీసుకుంటే రక్త పోటు సమస్యలు కూడా వస్తాయి. చాలా తక్కువ ఉప్పు కలిపి తీసుకుంటేనే బెటర్ అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

చక్కెరతో తింటే..

పెరుగులో పంచదార కలిపి తినే అలవాటు చాలా మందికి ఉంటుంది. ఇలా తినడం వల్ల జీర్ణ వ్యవస్థకు కూడా మేలే. పెరుగులో ఉండే మంచి బ్యాక్టీరియా కూడా చావదు. అయితే ఈ కాంబినేషన్‌లో క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి. ఇలా తింటే వేగంగా బరువు పెరుగుతారు. డయాబెటీస్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. పెరుగును ఎలా తీసుకుంటే మంచిది?

అసలు నిజం చెప్పాలంటే పెరుగులో ఎలాంటివి కలపకుండా తీసుకోవడం వల్లనే ఆరోగ్యానికి చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అదే విధంగా పెరుగులో కొద్దిగా ఉప్పు, పంచదార కలిపి తీసుకున్నా పర్వాలేదు. ఇలా తిన్నా కూడా నష్టాలు లేకపోలేదు. కాబట్టి ఆరోగ్య పరిస్థితిని బట్టి తీసుకోవాలి.

Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page