top of page

🎥🎬 సలార్ పార్ట్ 3.. ఇంట్రెస్టింగ్ కామెంట్ చేసిన ప్రశాంత్ నీల్ వైఫ్

🌟🔍 ప్రశాంత్ నీల్ తన సినిమాల విషయంలో చాలా కేర్ తీసుకుంటాడు. ‘సలార్’ విడుదలకు చాలా సమయం పట్టింది. రెండో భాగాన్ని తీయడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుందో తెలియదు.

ఈ సినిమా కథను వివరంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు ప్రశాంత్ నీల్ దాంతో ఎక్కువ సమయం పట్టే అవకాశం కనిపిస్తుంది. ప్రశాంత్ నీల్ భార్య లిఖితా నీల్ సోషల్ మీడియాలో ఇటీవల ‘ఆస్క్ మీ’ సెషన్‌ను నిర్వహించింది. ఓ నెటిజన్ ఆమెను ‘సలార్ 3′ వస్తుందా.? అని ఒక ప్రశ్న అడిగారు. దానికి ఆమె స్పందిస్తూ..దీని పై ఆమె స్పందిస్తూ సెకండ్ పార్ట్ పూర్తయిన తర్వాతే దీనిపై సమాధానం చెబుతాం’ అని అన్నారు. ఈ మాటను ఆమె జోక్‌గా అన్నారా లేక సీరియస్‌గాఅన్నది మాత్రం అర్ధం కాలేదు. ‘సలార్’ సినిమాలో ప్రభాస్ రుగాడ్ పాత్రలో నటించాడు. పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్ర పోషించారు. శృతి హాసన్ కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టింది. రీసెంట్ గా సక్సెస్ పార్టీ చేసుకుంది చిత్ర బృందం. ఈ పార్టీలో దర్శకుడు ప్రశాంత్ నీల్, నిర్మాత విజయ్ కిర్గందూర్, హీరో ప్రభాస్, హీరోయిన్ శృతిహాసన్, నటుడు జగపతిబాబు, సంగీత దర్శకుడు రవి బస్రూరు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తీసిన వీడియోను ‘హోంబాలే ఫిల్మ్స్’ సోషల్ మీడియాలో షేర్ చేసింది. 🎬🍿


Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page