top of page

🎶ఆహ్లాదంగా ‘సూరీడే’ సాంగ్.. ప్రభాస్ ఫ్యాన్స్ ఫిదా🤝

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతోన్న ‘సలార్’ మూవీపై అభిమానులు, ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ఈ సినిమాతో ప్రభాస్ ఇండియన్ సినిమా రికార్డులు తిరగరాస్తాడని అంతా భావిస్తున్నారు. స్నేహబంధం నేపథ్యంలో ఈ సినిమా కథ ఉండబోతోందని ట్రైలర్ చూస్తే అర్థమైంది. ఇక ఆ స్నేహబంధానికి సంబంధించే తాజాగా  పాటను విడుదల చేశారు. ‘సూరీడే గొడుగు పట్టి’ అంటూ సాగే ఈ పాట చాలా ఆహ్లాదకరంగా ఉంది. రవి బస్రూర్ స్వరపరిచిన ఈ పాటను హరిణి వైటూరి ఆలపించారు. కృష్ణకాంత్ సాహిత్యం అందించారు. లిరికల్ వీడియోలో ప్రభాస్, పృథ్వీరాజ్ సుకుమార్ మధ్య కొన్ని షాట్స్ కూడా చూపించారు. ఈ సినిమా హోంబలే ఫిలింస్ బ్యానర్‌పై విజయ్ కిరగందూర్ నిర్మించగా.. తెలుగులో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ విడుదల చేస్తోంది.🕊️💫



Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page