top of page

🌟🔥 ప్రభాస్ ఫ్యాన్స్‏కు క్రేజీ అప్డేట్..సలార్‌కు ఎ సర్టిఫికెట్.. ‘సలార్’ రన్ టైమ్ ఎంతంటే.. 🎉🎬

ప్రభాస్ సలార్‌ మూవీకి ఎ సర్టిఫికెట్ ఇచ్చారు. ఇక రన్‌టైమ్ కూడా చాలా ఎక్కువగానే ఉంది. డిసెంబర్ 22న రిలీజ్ కాబోతున్న ఈ సినిమా సెన్సార్ పనులు పూర్తి చేసుకుంది. 📅🎥

ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆసక్తి రేపుతున్న ప్రభాస్ సలార్ మూవీ సెన్సార్ పనులు పూర్తి చేసుకుంది. ఈ మూవీ రన్ టైమ్ ఎక్కువే అన్న వార్తలు నిజమయ్యాయి. 🔥🎬ప్రశాంత్ నీల్ తన సినిమాల నిడివి పెద్దవిగా ఉంచే ఆనవాయితీని కొనసాగించాడు. అతని చివరి సినిమా కేజీఎఫ్ 2 రన్ టైమ్ 2 గంటల 48 నిమిషాలుగా ఉంది. ⏰🎞️ఇక సలార్ మూవీ రన్ టైమ్ ఏకంగా 2 గంటల 55 నిమిషాల 22 సెకన్లు కావడం విశేషం. ఈ సినిమాకు సీబీఎఫ్‌సీ 'ఎ' సర్టిఫికెట్ ఇచ్చింది. 🎬🔞 ఈ యాక్షన్ డ్రామా హింస కాస్త ఎక్కువగానే ఉన్నట్లు ట్రైలర్ చూస్తేనే తెలిసిపోయింది. 🔥💔

దీంతో సలార్ కు అడల్ట్ సర్టిఫికెట్ ఇచ్చారు. అంటే 18 ఏళ్లు పైబడిన వాళ్లు మాత్రమే థియేటర్లలో ఈ సినిమా చూడాల్సి ఉంటుంది. 👫🎦సలార్ మూవీ డిసెంబర్ 22న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది. ఆ రోజు అర్ధరాత్రి 12.30 గంటల నుంచే ఫస్ట్ డే ఫస్ట్ షోలు ప్రారంభం కానున్నట్లు కూడా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. 🌍🌟ఈ మూవీ తెలుగుతోపాటు హిందీ, కన్నడ, తమిళం, మలయాళం భాషల్లో రిలీజ్ కానుంది. అయితే సలార్ మూవీకి మరో పాన్ ఇండియా సినిమా డంకీ నుంచి పోటీ ఎదురు కానుంది. 🔄🎭

షారుక్ ఖాన్ నటించిన ఈ మూవీ డిసెంబర్ 21నే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ ఇద్దరు సూపర్ స్టార్లలో బాక్సాఫీస్ దగ్గర ఎవరు పైచేయి సాధిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. 🌟💪సలార్ మూవీలో ప్రభాస్ తోపాటు శృతి హాసన్, పృథ్వీరాజ్ సుకుమారన్, ఈశ్వరి రావు, జగపతి బాబు, టిన్నూ ఆనంద్ ముఖ్యమైన పాత్రలు పోషించారు. హోంబలె ఫిల్మ్స్ తెరకెక్కించిన ఈ సినిమాకు కేజీఎఫ్ ఫేమ్ రవి బస్రూర్ మ్యూజిక్ అందించాడు. 🎵🎬

Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page