top of page

డైనోసార్ ఆగయా..‘సలార్’ ప్రమోషన్స్ స్టార్ట్..🎬🌟

సలార్ అప్డేట్ గురించి ఆసక్తికర న్యూస్ ఇప్పుడు ఫిల్మ్ సర్కిల్లో చక్కర్లు కొడుతుంది. లేటేస్ట్ సమాచారం ప్రకారం ఈ సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో ను భారతదేశంలో డిసెంబర్ 22న ఉదయం 12.30 గంటలకు విడుదల చేసే అవకాశం ఉందట...

ఇందులో విలన్ పాత్ర పోషిస్తున్న పృథ్వీరాజ్ సుకుమారన్ కేరళలో డిస్ట్రిబ్యూటర్ గా వ్యవహరిస్తున్నారు. పృథ్వీరాజ్ ప్రొడక్షన్స్ నిర్మాణ సంస్థ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని కేరళ అంతటా పంపిణీ చేస్తున్నారు. ఇప్పటికే కేరళలో ప్రమోషన్స్ స్టార్ట్ చేసారు. నివేదికల ప్రకారం కేరళలలో సలార్ ప్రమోషన్స్ షూరు అయ్యాయని టాక్ వినిపిస్తుంది. అయితే దీనిపై ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ రాలేదు. మొదటిసారి ప్రశాంత్ నీల్, ప్రభాస్ కాంబోలో రాబోతున్న సలార్ చిత్రం బాక్సాఫీస్ వద్ద విధ్వంసం సృష్టించడం ఖాయమని తెలుస్తోంది. ఇద్దరు ప్రాణ స్నేహితులు శత్రువులుగా ఎలా మారారు. వారిద్దరి మధ్య ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి అనేది సలార్ ఫస్ట్ పార్ట్ లో చూపించనున్నారు. కేరళ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 300లకు పైగా స్క్రీన్స్ లో ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు. అడ్వాన్స్ బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి. కొట్టాయంలోని ప్రముఖ థియేటర్లో విడుదల రోజున అంటే డిసెంబర్ 22న ఉదయం 6 గంటలకు ఫస్ట్ షో రిలీజ్ చేయనున్నారు. ఈ చిత్రాన్ని తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషలలో రిలీజ్ చేయనున్నారు. 🎥🌐


Hozzászólások


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page