top of page
Suresh D

ఆ సినిమాలో డాన్స్ చేయడం కష్టంగా అనిపించింది🎥

న్యాచురల్ స్టార్ నాని ప్రధాన పాత్రలో నటించిన శ్యామ్ సింగరాయ్ సినిమాలో సాయి పల్లవి, కృతి శెట్టి హీరోయిన్లుగా నటించారు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయ్యింది.

న్యాచురల్ స్టార్ నాని ప్రధాన పాత్రలో నటించిన శ్యామ్ సింగరాయ్ సినిమాలో సాయి పల్లవి, కృతి శెట్టి హీరోయిన్లుగా నటించారు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయ్యింది. ఎప్పటిలాగే ఈ మూవీలో ట్రెడిషనల్ పాత్రలో మెప్పించింది సాయి పల్లవి. ఇందులో క్లాసికల్ డాన్స్ మాత్రం అదరగొట్టింది. కానీ ఈ మూవీకి డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో చాలా కష్టపడ్డానని తెలిపింది. ఆ సమయంలో శారీరకంగా దెబ్బతిన్నానని.. ఎంతో అలిసిపోయానని  సినిమాలో తాను చేసిన శాస్త్రీయ నృత్యం.. ఆ మూవీలో చేసిన ప్రతి డాన్స్ సమయంలో పీరియడ్స్ కారణంగా చాలా కష్టపడ్డానని.. 2, 3 రోజులు గంటల తరబడి షూటింగ్ చేయాల్సి వచ్చిందని.. ఆ సమయంలో అలసిపోయినప్పుడు తన తండ్రి తన పాదాలకు మసాజ్ చేసేవాడని గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.ప్రస్తుతం సాయి పల్లవి చేసిన కామెంట్స్ మరోసారి వైరలవుతున్నాయి. ఇప్పుడు సాయి పల్లవి తండేల్ సినిమాలో నటిస్తుంది. లవ్ స్టోరీ తర్వాత మరోసారి నాగ చైతన్య జోడిగా నటిస్తుంది. ఈ చిత్రానికి చందూ మొండేటీ దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే హిందీలో అమీర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్ జోడిగా ఏక్ దిన్ సినిమాలో నటిస్తుంది.🎥

bottom of page