top of page

రష్మికతో ల‌వ్ ఎఫైర్‌..ఎట్ట‌కేల‌కు ఓపెనయిన బెల్లంకొండ‌.!

గత కొద్ది రోజులుగా అడపా దడపా బెల్లంకొండ సాయి శ్రీనివాస్, రష్మిక మందన్న కలిసి కనిపిస్తూ ఉండడంతో వారి మధ్య ఏదో ఉందనే ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతోంది.


Sai Sreenivas Bellamkonda Rashmika Mandanna Dating : సినీ పరిశ్రమలో కొన్ని పుకార్లు ఎందుకు పుట్టుకొస్తాయో ఎలా పుట్టుకొస్తాయో కూడా తెలియదు. కానీ ఏమీ లేని వారి మధ్య కూడా ఏదో ఉందని ఫ్రేమ్ చేసే విధంగా కొన్ని పుకార్లు పుట్టుకొస్తూ ఉంటాయి. నిజానికి కన్నడ సినీ పరిశ్రమ ద్వారా హీరోయిన్ గా లంచ్ అయ్యి తర్వాత తెలుగులో టాప్ హీరోయిన్ గా కొనసాగుతున్న రష్మిక మందన ఈ మధ్యనే బాలీవుడ్ బాట పట్టింది. మరోపక్క బెల్లంకొండ సురేష్ కుమారుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కూడా రాక్షసుడు సినిమాతో టాలీవుడ్ లో హిట్ అందుకుని ఇప్పుడు బాలీవుడ్ లో హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు.ప్రభాస్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన చత్రపతి సినిమాని హిందీలో అదే పేరుతో రీమేక్ చేస్తున్నాడు. ప్రభాస్ పాత్రలో సాయి శ్రీనివాస్ హీరోగా నటిస్తున్నాడు. సాయి శ్రీనివాస్ నటించిన అనేక సినిమాలను హిందీలో డబ్బింగ్ చేసి యూట్యూబ్లో విడుదల చేస్తే మిలియన్ల కొద్దీ వ్యూస్ వస్తున్న నేపథ్యంలో ఈ చత్రపతి రీమేక్ సినిమాని పెన్ స్టూడియోస్ సంస్థ నిర్మిస్తోంది.అలా ఒకపక్క రష్మిక మందన్న మరోపక్క బెల్లంకొండ సాయి శ్రీనివాస్ బాలీవుడ్ లో పాగా వేసే ప్రయత్నాలు చేస్తున్నారు. నిజానికి రష్మిక మందన చేసిన కొన్ని సినిమాలు హిందీలో రిలీజ్ కూడా అయ్యాయి. కానీ ఈ భామకు అనుకున్నంత క్రేజ్ అయితే దక్కలేదు. ఈ నేపథ్యంలో ఎక్కువగా ముంబైలోనే ఉంటూ అక్కడి దర్శక నిర్మాతల చుట్టూ అవకాశాల కోసం తిరగడమే కాదు బాలీవుడ్ లో ఎలాంటి సినిమా ఈవెంట్లు అయినా వెంటనే అక్కడ వాలిపోతుంది.తర్వాత విజయ్ దేవరకొండ తో ప్రేమలో పడినట్లు కూడా ప్రచారం జరిగింది. విజయ్ దేవరకొండ రష్మిక కలిసి మాల్దీవులకు వెళ్ళినట్లు పలు వెకేషన్స్ కి వెళ్ళినట్లు సోషల్ మీడియాలోనే అనేక ప్రచారాలు జరిగా.యి అయితే ఏమైందో ఏమో తెలియదు కానీ వారిద్దరి మధ్య బ్రేకప్ అయిందని అందుకే ఇప్పుడు రష్మిక మందన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మధ్య ఏదో జరుగుతోందని కొత్త ప్రచారం తెర మీదకు వచ్చింది. అయితే ఈ ప్రచారం మీద ఎట్టకేలకు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ స్పందించాడు. హిందీ చత్రపతి సినిమా మే 12వ తేదీన రిలీజ్ అవుతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్స్ నిర్వహిస్తోంది సినిమా యూనిట్.

Commentaires


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page