ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు జోరుగా కురుస్తున్నాయి. దీంతో ప్రాజెక్టులన్నీ నీటితో కళకళలాడుతున్నాయి. మరి ఇలాంటి సమయంలో ప్రాజెక్టులను సందర్శిస్తే ఆ కిక్కే వేరుగా ఉంటుంది కదూ! హైదరాబాద్ నగరానికి చేరువలో ఉన్న నాగార్జున్ సాగర్ ఇలాంటి అనుభూతినే అందిస్తుంది. తెలంగాణ టూరిజం ప్రత్యేక టూర్ ప్యాకేజీని అందిస్తోంది. కేవలం ఒకటే రోజులో టూర్ ముగిసేలా ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తున్నారు. ఉదయం వెళ్లి మళ్లీ రాత్రి వరకు ఇంటికి చేరుకోవచ్చు. ప్రతీ శని, ఆదివారం ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తున్నారు. ఇంతకీ హైదరాబాద్-నాగార్జునసాగర్-హైదరాబాద్ పేరుతో అందుబాటులోకి తీసుకొచ్చిన ఈ టూర్ ప్యాకేజీలో ఏయే ప్రాంతాలు కవర్ అవుతాయి.? ప్యాకేజీ ధర విశేషాలు ఏంటి.? ఇప్పుడు తెలుసుకుందాం..
ప్రయాణం ఇలా సాగుతుంది..
* ఉదయం 7.30 గంటలకు పర్యాటక భవన్ నుంచి బస్సు బయలు దేరుతుంది. * అనంతరం 8 గంటలకు బషీర్‌బాగ్‌లోని సీఆర్‌ఓ వద్ద బస్సు ప్రయాణం మొదలవుతుంది.
* ఉదయం 11.30 గంటలకు నాగార్జున సాగర్ చేరుకుంటా.
* 11.40 గంటల నుంచి 12.30 గంటల వరకు బుద్ధవనం ప్రాజెక్ట్ సందర్శన ఉంటుంది.
* ఇక ఆ తర్వాత ఒంటి గంట నుంచి 2 గంటల వరకు లంచ్ బ్రేక్ ఉంటుంది.
* మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు బోటింగ్, మ్యూజియం, నాగార్జున కొండ సందర్శన ఉంటుంది.
* సాయంత్రం 4 గంటలకు డ్యామ్ సందర్శన ఉంటుంది.
* ఇక సాయంత్రం 5 గంటలకు నాగార్జున సాగర్ నుంచి తిరుగు ప్రయాణం మొదలై.. 9 గంటల వరకు హైదరాబాద్ చేరుకుంటారు. దీంతో టూర్ ముగుస్తుంది.