top of page

రష్యా భూభాగంలోకి ఉక్రెయిన్‌ బలగాలు.. 74 నివాస ప్రాంతాలను ఆధీనంలోకి వచ్చాయన్న జెలెన్‌స్కీ..!


కీవ్‌, ఆగస్టు 14: తమ బలగాలు రష్యాలోని కుర్స్‌ ప్రాంతంలో మరింత ముందుకు చొచ్చుకెళ్తున్నాయని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ బుధవారం తెలిపారు. ఉక్రెయిన్‌ మిలిటరీ చీఫ్‌ ఒలెక్సాండ్‌ సైర్సైతో ఆయన వీడియో కాల్‌ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్‌ బలగాలు రష్యా సరిహద్దు దాటిన తర్వాత కిలోమీటరు నుంచి రెండు కిలోమీటర్ల వరకు రష్యాలోకి తమ బలగాలు ప్రవేశించాయని తెలిపారు. 100 మంది రష్యా సైనికులు తమ అదుపులో ఉన్నారని, ఇది తమ పిల్లలు తిరిగి ఉక్రెయిన్‌ చేరుకునేందుకు అవకాశం కల్పిస్తుందని తెలిపారు. రష్యాలోని 74 నివాస ప్రాంతాలు తమ ఆధీనంలోకి వచ్చినట్టు ప్రకటించారు. భారతీయులకు అడ్వైజరీ

రష్యా ఆధీనంలో ఉన్న ప్రాంతాలకు ఉక్రెయిన్‌ బలగాలు చేరాయనే వార్తల నేపథ్యంలో రష్యాలో ఉన్న భారతీయులకు భారత రాయబార కార్యాలయం అడ్వైజరీ జారీ చేసింది. బ్రయాన్స్‌, బెల్గొరొడ్‌, కుర్స్‌ ప్రాంతాల్లో నివసించే భారతీయులు ఇటీవలి భద్రతా సంఘటనల దృష్ట్యా తాత్కాలికంగా సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించింది.


Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page