top of page
MediaFx

సంబంధం లేని రూమర్స్ కి చెక్ పెట్టేసిన మేకర్స్


రాజమౌళి త్వరలో మహేష్ బాబుతో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ పూర్తయిందని, ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుందని సమాచారం. మహేష్ బాబు కూడా బాగా జుట్టు పెంచి, బాడీ మీద ఫోకస్ చేసి ఈ సినిమా కోసం రెడీ అవుతున్నాడు. అయితే ఇప్పటివరకు కూడా ఈ సినిమా నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు కానీ ఎవరికీ తోచింది వాళ్ళు రోజుకొక వార్తలు రాసుకుంటున్నారు. కొద్దిరోజుల నుంచి రాజమౌళి – మహేష్ బాబు సినిమాలో నటించే నటీనటులు వీళ్ళే అని పలువురు పేర్లు వినిపించాయి. ఇటీవల ఓ ఇంగ్లీష్ వెబ్ సైట్ ఈ సినిమాకు కాస్టింగ్ డైరెక్టర్ వీరేన్ స్వామి పనిచేస్తున్నట్టు వార్త రాశారు. దీనిపై మూవీ యూనిట్ స్పందిస్తూ చిత్ర నిర్మాణ సంస్థ శ్రీ దుర్గ ఆర్ట్స్ నుంచి తాజాగా అధికారిక లేఖని విడుదల చేసింది. శ్రీ దుర్గ ఆర్ట్స్ తమ లేఖలో.. SS రాజమౌళి & మహేష్ బాబు రాబోయే సినిమా కోసం కాస్టింగ్ రూమర్స్ పై క్లారిటీ కోసమే ఈ లేఖ. ఇటీవల ప్రముఖ సంస్థ (టైమ్స్ ఆఫ్ ఇండియా) SS రాజమౌళి, మహేష్ బాబు ప్రాజెక్ట్ యొక్క కాస్టింగ్ గురించి ఒక కథనాన్ని ప్రచురించినట్లు మా దృష్టికి వచ్చింది. అందులో పేర్కొన్నదానికి విరుద్ధంగా వీరేన్ స్వామి మా సినిమాలో ఏ విధంగాను భాగం కాలేదు. దీన్ని మేము స్పష్టం చేయాలనుకుంటున్నాము. అవసరమైనప్పుడు సినిమా గురించి అన్ని అధికారిక ప్రకటనలు నిర్మాణ సంస్థ తెలుపుతుంది అని క్లారిటీ ఇచ్చారు. మరి ఈ లేఖతో అయినా SSMB29 సినిమాపై వచ్చే నటీనటుల రూమర్స్ ఆగుతాయేమో చూడాలి. అభిమానులు మాత్రం ఏదో ఒక అప్డేట్ ఇమ్మని అడుగుతూనే ఉన్నారు.


bottom of page