top of page
Shiva YT

🚨 ఎలాంటి ప్రీమియం చెల్లించకుండానే ఉద్యోగులకు రూ.1.12 కోట్ల బీమా...🚑

🛣️ రోడ్డు ప్రమాదాల్లో ఆర్టీసీ ఉద్యోగులు అకాల మరణం చెందినా, శాశ్వతంగా దివ్యాంగులైన సిబ్బందికి ఈ ప్రమాద బీమా వర్తించనుంది. దీన్నంతటిని యూబీఐ సూప‌ర్ శాల‌రీ సేవింగ్ అకౌంట్ కింద రూ.కోటి ప్రమాద బీమాను అందించనున్నారు.

అలాగే రూపే కార్డు ద్వారా మరో రూ.12 లక్షల వరకు బీమా వర్తిస్తుంది. అయితే ఇందు కోసం ఎలాంటి ప్రీమియం చెల్లించకుండానే మొత్తంగా రూ.1.12 కోట్ల వరకు ప్రమాద బీమాను యూబీఐ సహకారంతో బాధిత కుటుంబాలకు ఆర్టీసీ సంస్థ అందించనుంది. పెరిగిన ప్రమాద భీమా ఫిబ్రవరి 1 వ తేది నుంచి అమల్లోకి రానుంది.

🤔 ఎలాంటి ప్రీమియం చెల్లింపు లేకుండా రూ.1.12 కోట్ల వరకు ప్రమాద బీమాను పెంచడం శుభపరిణామన్నారు టీఎస్‌ఆర్‌టీసీ ఎండీ వీసీ సజ్జనర్. ప్రమాద బీమాను పెంచాలని కోరగానే అంగీకరించిన యూబీఐ ఉన్నతాధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రమాద బీమా పెంపు అంశాన్ని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్వాగతించారని, ఇది సిబ్బందికి ఎంతో మేలు చేకూరుస్తుందని అభిప్రాయపడ్డారు. యూబీఐ సూప‌ర్ శాల‌రీ సేవింగ్ అకౌంట్ కింద రోడ్డు ప్రమాదాల్లో మరణించిన 12 మంది సిబ్బంది కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.40 లక్షల చొప్పున అందజేశామని తెలిపారు. ఉద్యోగుల సంక్షేమానికి సంస్థ అధిక‌ ప్రాధాన్యత‌నిస్తున్నట్లు సజ్జనార్ గుర్తు చేశారు. 🙏✨

bottom of page