top of page

🌷 ఇక రంగంలోకి గులాబీ దళపతి..

📍 సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో ఈ నెల 15న జరిగే సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ పనులు శరవేగంగా జరుగుతున్నాయని స్థానిక ఎమ్మెల్యే సతీష్ కుమార్ తెలిపారు. 🌟

ఇప్పటికే హెలిప్యాడ్ నిర్మాణం పూర్తయిందని, సభాస్థలి వేదిక పనులు రేపటి వరకు పూర్తవుతున్నాయన్నారు. 🏗️ సీఎం కేసీఆర్ సభాస్థలంలో జరుగుతున్న ఏర్పాట్లను పార్టీ శ్రేణులతో కలిసి ఎమ్మెల్యే సతీష్ కుమార్ పరిశీలించారు. 🕵️‍♂️ ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ హుస్నాబాద్ నియోజకవర్గం సీఎం కేసీఆర్ కు లక్ష్మీ నియోజకవర్గమని, గతంలో 2014 ,2018 రెండుసార్లు హుస్నాబాద్ నుండి కేసీఆర్ ఎన్నికల ప్రచారాన్ని బహిరంగ సభ ద్వారా ప్రారంభించారని గుర్తు చేశారు. 📣 మూడోసారి హ్యాట్రిక్ దిశగా దూసుకుపోతూ తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రభంజనం సృష్టించబోతుందన్నారు. 🌆 బహిరంగ సభ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తవుతున్నాయని మహిళలకు, వికలాంగులకు ప్రత్యేకమైన గాలరీలు ఏర్పాటు చేశామని, సభలో ఎవరికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. 🤝 అన్ని వర్గాల ప్రజలు అధిక సంఖ్యలో హాజరై ప్రజా ఆశీర్వాద సభను విజయవంతం చేయాలని కోరారు.

📜 మేనిఫెస్టోలోని పథకాలు:

☑️ ఇప్పటికే అమలవుతోన్న పథకాలు కొనసాగింపు

👩‍🌾 రైతులు, మహిళల కోసం ప్రత్యేక పథకాలు

🚜 రైతాంగం, వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యత

💼 రైతుబంధు, రైతు బీమా నగదు పెంచే అవకాశం

👩‍⚖️ మహిళా సాధికారత కోసం ప్రత్యేక కార్యాచరణ

👪 దిగువ, మధ్యతరగతి కుటుంబాల కోసం కొత్త పథకాలు

👩‍👩‍👧‍👧 ఒంటరి మహిళలు, బీసీలు, మైనారిటీల కోసం స్పెషల్ స్కీమ్స్

🌍 దళితబంధు, బీసీ బంధు, మైనారిటీ బంధుపై మరింత ఫోకస్‌

🌟 యువత, గృహిణులు, ఒంటరి మహిళల కోసం ప్రత్యేక పథకాలు


Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page