top of page
MediaFx

గంటన్నరకే కోటి దాటిన సబ్‌స్ర్కైబర్లు.. యూట్యూబ్‌లో రొనాల్డో తుఫాను


ఆధునిక ఫుట్‌బాల్‌ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో ప్రముఖ సామాజిక మాధ్యమం యూట్యూబ్‌లో పెనుతుఫాను సృష్టిస్తున్నాడు. ఈ వేదికలోకి అరంగేట్రం చేసిన గంటల్లోపే రికార్డు స్థాయి ‘సబ్‌స్క్రిప్షన్స్‌’తో యూట్యూబ్‌ మోత మోగిపోతోంది. బుధవారం (ఆగస్టు 21) యూట్యూబ్‌లోకి ‘యువర్‌ క్రిస్టియానో’ అనే పేరుతో చానెల్‌ను క్రియేట్‌ చేసిన రొనాల్డో.. కేవలం 90 నిమిషాల్లోనే 10 మిలియన్‌ సబ్‌స్క్రిప్షన్స్‌ (కోటి మంది)ను దాటాడు. యూట్యూబ్‌ చరిత్రలో ఇంత వేగంగా 10 మిలియన్‌ సబ్‌స్ర్కైబర్స్‌ను దాటిన చానెల్‌ మరొకటి లేదు. దీంతో యూట్యూబ్‌ అతడికి ‘గోల్డెన్‌ బటన్‌’ను అందించింది. ఇందుకు సంబంధించిన వీడియోనూ అతడు తన ట్రేడ్‌ మార్క్‌ సెలబ్రేషన్‌ ‘సూ’ను పోలినట్టుగా ‘థాంక్యూ సూ..బ్‌స్ర్కైబర్స్‌’ అని పోస్ట్‌ చేయగా అదీ రికార్డులు బద్దలు కొడుతోంది. ఇక తనకు కాబోయే భార్యను పరిచయం చేస్తూ చేసిన వీడియోతో యూట్యూబ్‌ అల్లకల్లోలమే అయింది. 12 గంటల్లోనే అతడి సబ్‌స్ర్కైబర్స్‌ సంఖ్య ఏకంగా 10 మిలియన్స్‌ (పది కోట్లు) దాటేసింది. యూట్యూబ్‌లో పది కోట్ల సబ్‌స్క్రిప్షన్స్‌ ఉన్న చానెల్‌కు ‘డైమండ్‌ బటన్‌’ను అందజేస్తారు.

ఇదిలా ఉండగా రొనాల్డో అభిమానుల దెబ్బకు ప్రముఖ అమెరికన్‌ ఇన్‌ఫ్లూయెన్సర్‌, వ్యాపారవేత్త అయిన మిస్టర్‌ బీస్ట్‌ యూట్యూబ్‌లో నమోదు చేసిన రికార్డులన్నీ చెల్లాచెదురవుతున్నాయి. 10 మిలియన్స్‌ సబ్‌స్క్రిప్షన్స్‌ అయ్యేందుకు బీస్ట్‌కు 132 రోజులు అవసరమైతే రొనాల్డో దానిని కేవలం 12 గంటల్లోనే అందుకున్నాడు. ప్రస్తుతం బీస్ట్‌ను 311 మిలియన్స్‌ (31.1 కోట్లు) మంది అనుసరిస్తుండగా రొనాల్డో (ఇప్పటికే 22 మిలియన్స్‌ దాటింది) అభిమానులు ఇదే ఊపు కొనసాగిస్తే మరికొన్ని గంటల్లోనే అతడు ఆ రికార్డునూ ఊదిపారేసే అవకాశముంది.


bottom of page