top of page
Shiva YT

నాన్న జ్ఞాపకాలకు దూరంగా వెళ్తున్న జబర్దస్త్ బ్యూటీ..

జబర్దస్త్‌ కమెడియన్‌ రీతూ చౌదరి ఇటీవలే తన తండ్రిని కోల్పోయింది. ఆ బాధ నుంచి ఇంకా బయటపడలేకపోతుంది. దీంతో తన నాన్న జ్ఞాపకాలకు దూరంగా వెళ్తుందట. ఈ మేరకు ఆమె ఎమోషనల్ వీడియోని పంచుకుంది.

`సరిగమప`లో సింగర్‌ యశస్విని హగ్‌ చేసుకుని ఒక్కసారిగా హాట్‌ టాపిక్‌ అయ్యింది హాట్‌ బ్యూటీ రీతూ చౌదరీ. జబర్దస్త్ కమెడియన్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఈ భామకి `సరిగమప` లైఫ్‌ ఇచ్చిందని చెప్పొచ్చు. ఆ ఒక్క సన్నివేశంతో ఆమె ఓవర్‌ నైట్ లో స్టార్‌ అయిపోయింది. అంతకు ముందు ఎన్ని షోస్‌ చేసినా, వీడియోస్‌ చేసినా రాని పేరు, క్రేజ్‌ యశస్వి కారణంగా వచ్చింది. బుల్లితెర స్టార్‌ అయిపోయింది.

ఆ తర్వాత `జబర్దస్త్` షోకి ఎంట్రీ ఇచ్చింది. ఇందులో జబర్దస్త్ కమెడియన్‌గా మెప్పించింది. అందం, హాట్‌నెస్‌ మేళవించిన ఈ హాట్‌ బ్యూటీ మొదట కామెడీ చేయడంలో ఇబ్బంది పడింది. డైలాగులు కూడా సరిగా చెప్పలేక విమర్శలెదుర్కొంది. ఆ తర్వాత సెట్‌ అయిబాగానే అలరించింది. కమెడియన్‌గా నవ్వులు పూయించింది. దీనికితోడు తన అసెట్‌ అయిన అందంతో మరింతగా ఆకట్టుకుంటుంది. అలరించింది. కొన్నాళ్ల తర్వాత జబర్దస్త్ ని కూడా వదిలేసింది. ఇన్‌స్టా రీల్స్, ఇతర టీవీ షోస్‌, షార్ట్ ఫిల్స్, యాడ్స్ చేస్తూ రాణిస్తుంది. అందాల విందుతో మరింతగా టెంప్ట్ చేస్తుంది.

ఇదిలా ఉంటే ఇటీవల అనూహ్యంగా తన తండ్రిని కోల్పోయింది రీతూ చౌదరి. హార్ట్ ఎటాక్‌తో తన ఫాదర్ చనిపోయినట్టు పేర్కొంది. ఈ సందర్బంగా తండ్రిని ఉద్దేశించి ఓ ఎమోషనల్‌ నోట్‌ని కూడా పంచుకుంది. నాన్నతో దిగిన ఫోటోని పంచుకుంటూ భావోద్వేగానికి గురయ్యింది. నువ్వు లేకపోతే నేను ఉండలేనని వాపోయింది. `ఈ కూతురి వద్దకు తిరిగి రా నాన్నా` అంటూ ఆమె పంచుకున్న నోట్‌ కన్నీళ్లు పెట్టించింది. ఇదిలా ఉంటే ఇప్పటికీ తండ్రి జ్ఞాపకాలను మరువలేకపోతుందట. నాన్నకి గారాల పట్టిగా పెరిగిన రీతూ చౌదరికి నాన్నంటే ప్రాణం. దీంతో ఆయన్ని మర్చిపోలేకపోతుంది. ఆ బాధ నుంచి బయటపడలేకపోతుంది.

ఈ నేపథ్యంలో షాకింగ్‌ నిర్ణయం తీసుకుంది రీతూ చౌదరి. నాన్నతోపాటు తాము కలిసున్న ఇంటి(రెంట్‌ హౌజ్‌)ని వదిలేస్తున్నారు. తండ్రి జ్ఞాపకాల నుంచి దూరంగా ఉండాలనే ఉద్దేశ్యంతో ఈ ఫ్లాట్ ని ఖాళీ చేస్తున్నట్టు తెలిపింది రీతూ చౌదరి. ఈ మేరకు ఆమె తన యూట్యూబ్‌ ఛానెల్‌లో వీడియో ద్వారా వెల్లడించింది. నాన్నకి గుర్తుగా ఇచ్చిన పిల్లోని, రూమ్‌ విశేషాలను పంచుకుంది. అక్కడ ఉంటే నాన్నే గుర్తొస్తున్నారని, ఏం చేయలేకపోతున్నామని, ఆ బాధ తమని వెంటాడుతుందని తెలిపింది రీతూ చౌదరి. అందుకే ఖాళీ చేస్తున్నామని చెప్పింది. పిల్లోపై నాన్న, తాను ఉన్న ప్రింటెడ్‌ కవర్‌ని చూపించి ఎమోషన్‌ అయ్యింది. ఆయన షర్ట్స్ ని కూడా ఇంకా అలానే దాచుకున్న రీతూ చౌదరి, వాటిని పట్టుకుని కన్నీళ్లు పెట్టుకుంది. నాన్న తాను కలిసి ఆడుకునేవాళ్లమని, కొట్టుకునే వాళ్లమని, కబుర్లు చెప్పుకునే వాళ్లమని, పైన మార్నింగ్‌, సాయంత్రం సమయంలో వ్యాయామాలు చేసేవాళ్లమని, నడుస్తూ ఫుడ్‌ తినేవాళ్లమని, తమకి ఎన్నో మెమరీస్‌ ఉండిపోయాయని తెలిపింది రీతూ. వాటన్నింటిని గుర్తుం చేసుకుంటూ భావోద్వేగానికి గురయ్యింది.


bottom of page