top of page

రాత్రి సమయంలో నదీ స్నానం చేయకూడదు అంటారు.. ఎందుకో తెలుసా..

హిందూ మతంలో నదులకు చాలా ప్రాముఖ్యత ఉంది. గంగా, యమునా, సరస్వతి, గోదావరి, కృష్ణా వంటి నదులను దేవతల అవతారాలుగా భావించి పూజిస్తారు. పూర్వకాలం నుంచి నదులను పవిత్రంగా భావిస్తూ పాపాలు తొలిగించే శక్తి గలవిగా కొలుస్తున్నారు. నదీ స్నానం చేయడం వల్ల శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని నమ్మకం ఉంది.

సనాతన ధర్మ ప్రకారం నదీ స్నానానికి కొన్ని నియమాలు ఉంటాయి. ఈ నియమాలను పాటించటం ముఖ్యం. గంగా నది గంగమాత అని పిలుస్తారు. కాశి, ప్రయాగ, హరిద్వార్, రిషికేశ్ లాంటి ప్రదేశాలకు భక్తులు గంగా స్నానం చేయడానికి వెళతారు. గంగా నదిలో స్నానం చేయడం వల్ల ఆత్మ శుద్ధి, మోక్షం లభిస్తుందని విశ్వాసం. మకర సంక్రాంతి, కుంభమేళా, గంగా దసరా వంటి పండుగలలో లక్షలాది మంది ప్రజలు తమ పాపాలను పోగొట్టుకోవడానికి గంగలో స్నానం చేస్తారు.

శ్లోకం: గంగేచ యమునే చైవా గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు.

ఇప్పటి తరానికి మరొక నియమం నచ్చలేదు అంటే నదీ స్నానం ఏ సమయంలోనైనా చేయవచ్చు అంటున్నారు. రాత్రి సమయంలో కూడా నదుల్లో స్నానం చేస్తున్నారు. కానీ పురాణాల ప్రకారం రాత్రి సమయంలో యక్షులు నదుల వద్ద ఉంటారని విశ్వాసం. అందుకే రాత్రి సమయంలో పవిత్ర నదుల్లో స్నానం చేయడం నిషేధం.


Commentaires


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page