top of page

‘టైటానిక్’ నటుడు మృతి


కొన్ని సినిమాలు హద్దులు దాటి దేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపుని సొంతం చేసుకుంటాయి. ప్రపంచవ్యాప్తంగా అభిమానులను అలరించి బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లను రాబడతాయి. అంతేకాదు డబ్బు సంపాదించిన ఆ సినిమాల్లోని పాత్రలు అందులో నటించిన నటీనీతులు కూడా ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ అవుతారు. అలాంటి సినిమాల్లో ఒకటి టైటానిక్. హాలీవుడ్ సినిమా టైటానిక్ పేరు వినని వారు ఎవరుంటారు? ఈ చిత్రంలో హీరో, హీరోయిన్ గా లియోనార్డో డికాప్రియో, కేట్ విన్స్లెట్ కీలక పాత్రలు పోషించారు. ఇప్పుడు ఈ సినిమాలోని ఓ పాత్రలో నటించిన హాలీవుడ్ నటుడు 79 ఏళ్ల బెర్నార్డ్ హిల్ తుది శ్వాస విడిచారు. బెర్నార్డ్ ఈ చిత్రంలో కెప్టెన్ ఎడ్వర్డ్ జాన్ స్మిత్ పాత్రను పోషించారు. ఈ పాత్రతో అతనికి పాపులారిటీ వచ్చింది. నటుడిగా బెర్నార్డ్ కు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు ఉంది.

బెర్నార్డ్ నటుడుగా అనేక దశాబ్దాలుగా చిత్ర పరిశ్రమలో భాగమయ్యాడు. ఆయన మృతి పట్ల అభిమానులు కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. ఒక వ్యక్తి ఇలా వ్రాశాడు – అందరూ అతను బాయ్స్ ఫ్రమ్ ది బ్లాక్ స్టఫ్‌లో పోషించిన పాత్రను సూచిస్తున్నారు.. అయితే అతను వోల్ఫ్ హాల్ సిరీస్‌లో కూడా చాలా బాగా నటించాడు. మరొక వ్యక్తి రాశాడు- గుడ్‌బై బెర్నార్డ్ హిల్. మీ అద్భుతమైన నటనతో మంచి మంచి సినిమాలతో మిమ్మల్ని ఎప్పుడూ గుర్తుంచుకుంటారు. కళ పట్ల ప్రజలను ప్రేరేపించిన విధానం, మీ  ప్రాముఖ్యతను కాదనలేమని నివాళుల్పిస్తున్నారు. బెర్నార్డ్ హిల్ తన కెరీర్‌లో చాలా సినిమాలు , సిరీస్‌లలో పనిచేశాడు. నటుడు 1976లో ట్రయల్ బై కాంబాట్ చిత్రంతో తన కెరీర్‌ను ప్రారంభించాడు. దీని తరువాత గాంధీ, ది బౌంటీ, ది చైన్, మౌంటైన్స్ ఆఫ్ ది మూన్, టైటానిక్, ది స్కార్పియన్ కింగ్, లార్డ్ ఆఫ్ ది రింగ్స్ , నార్త్ vs సౌత్ వంటి చిత్రాలలో పనిచేశాడు. అతను బాయ్స్ ఫ్రమ్ ది బ్లాక్ స్టఫ్, సన్‌రైజ్, వోల్ఫ్ హాల్ వంటి సిరీస్‌లో నటించి తన నటనతో ప్రసిద్ది చెందాడు.


Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page