top of page
MediaFx

ఇండియాలో ధనవంతుడైన ఎంపీ అభ్యర్థి టీడీపీలో

ఏపీలో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల సమయం దగ్గర పడుతోంది. అభ్యర్థులంతా నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ తరఫున గుంటూరు నుంచి లోక్ సభ నుంచి బరిలోకి దిగిన డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ నామినేషన్ దాఖలు చేశారు. దేశవ్యాప్తంగా ఎంపీ స్థానాల్లో నామినేషన్లు దాఖలు చేసే అభ్యర్థులు తమ ఆస్తుల్ని తక్కువగానే చూపిస్తుంటారు. అయితే అమెరికాలోని మెడికల్ ఎడ్యుకేషన్ ఫీల్డ్ లో ఉన్న డాక్టర్ పెమ్మసాని మాత్రం తనకు ఎన్ని ఆస్తులు ఉన్నాయనే విషయాన్ని నిర్భయంగా ప్రకటించారు. పెమ్మసాని చంద్రశేఖర్ కుటుంబానికి మొత్తంగా రూ.5598 కోట్ల ఆస్తులు ఉన్నాయి. స్థిరాస్తులతోపాటు చరాస్తులు కూడా ఉన్నాయికానీ అందులో కుటుంబ సభ్యులవి కూడా ఉన్నాయి. అప్పులు వెయ్యి కోట్లరూపాయలు ఉన్నట్లు చూపించారు. ఎంబీబీఎస్ వరకు భారత్ లోనే చదువుకున్న పెమ్మసాని పై చదువుల కోసం అమెరికాకు వెళ్లి అక్కడే వైద్యరంగంలో స్థిరపడ్డారు. యూవరల్డ్ పేరుతో అమెరికాలో వైద్య పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులకు ఆన్ లైన్ ఎడ్యూటెక్ కంపెనీని నడుపుతున్నారు. ఇది ప్రధానమైనదే అయినప్పటికీ ఇంకా మరికొన్ని కంపెనీలు కూడా ఉన్నాయి.

జన్మభూమికి సేవ చేయాలనే ఉద్దేశంతో ఏపీకి తిరిగివచ్చారు. అమెరికాలో ఉన్న సమయంలోనే రాష్ట్రవ్యాప్తంగా, ప్రధానంగా పల్నాడులో విస్త్రత సేవా కార్యక్రమాలు నిర్వహించేవారు. ఇప్పటికీ చేస్తున్నారు. గుంటూరు నుంచి గతంలోనే ఎంపీగా పోటీచేయాలని భావించినప్పటికీ గల్లా జయదేవ్ ఉండటంతో ఓపిక పట్టారు. గల్లా రాజకీయాల నుంచి తాత్కాలిక విరామం ప్రకటించడంతో పెమ్మసానిని చంద్రబాబు ఎంపిక చేశారు. తెలుగును, తెలుగు నేలను మరిచిపోని పెమ్మసాని ప్రస్తుతం గుంటూరు లోక్ సభ నియోజకవర్గ పరిధిలో విస్త్రతంగా కలియతిరుగుతున్నారు. జయదేవ్ ను మించిన నేతగా గుర్తింపు తెచ్చుకుంటున్నారు.

Comments


bottom of page