🇮🇳🗣️తెలుగు దంగల్. యస్. తెలుగులో రాజకీయం రచ్చ రేపింది. అక్కడా ఇక్కడా కాదు. ఏకంగా దేశ రాజధాని ఢిల్లీలో. అందులోనూ పార్లమెంటు సాక్షిగా తెలుగు మాటలు.. మంటలు పుట్టించాయి. మొదట రేవంత్‌రెడ్డి బిగిన్ చేస్తే.. తర్వాత బండి సంజయ్ అందుకున్నారు. అచ్చ తెలుగులో రాజకీయం మాట్లాడితే ఎట్టా ఉంటాదో ఢిల్లీకి రుచి చూపించారు. రేవంత్ వర్సెస్ బండి.. తెలుగులో పేలిన డైనమైట్ల లాంటి డైలాగులకు పార్లమెంట్ దద్దరిల్లింది.
🇮🇳📜 వాడివేడిగా సాగిన పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో నిరవధికంగా వాయిదా పడ్డాయి. ఈ సమావేశాల్లో అవిశ్వాసంపై చర్చ, కీలక బిల్లులకు ఆమోదంతో పాటు ఉభయ సభల్లో ముగ్గురు సభ్యులపై సస్పెన్షన్ వేటు పడింది. జూలై 20వ తేదీన ప్రారంభమైన పార్లమెంట్ వర్షకాల సమావేశాల్లో లోక్‌సభ 17సార్లు భేటీ అయింది. ఈ సమావేశంలో 44 గంటల 15 నిమిషాల పాటు లోక్‌సభ కొలువుదీరింది. ఈ సమావేశాల్లో మొత్తం 20 బిల్లులు ప్రవేశపెట్టారు. 22 బిల్లులను సభ ఆమోదించింది.👥📅📜