top of page

కర్ణాటకలో ఓటమికి ప్రజలకు ఇచ్చిన రిటర్న్ బహుమతి..

2 వేల నోటుకు కాలం చెల్లిందని రిజర్వు బ్యాంక్ చావు కబురు చల్లగా చెప్పడంతో దేశవ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. ఆర్థిక నిపుణులు సైతం దీన్ని ఖండిస్తుండగా ప్రతిపక్షం కాంగ్రెస్ నిప్పులు చెరుగుతోంది. మరో వైపు సోషల్ మీడియా ద్వారా నెటిజన్లు తీవ్ర స్థాయిలో మోడీ సర్కార్ పై విరుచుకుపడుతున్నారు.

కర్ణాటకలో ఓటమికి ప్రజలకు ఇచ్చిన రిటర్న్ గిఫ్టా.. అంటూ పంచులు పేల్చుతున్నారు. అయితే గతంలోనే ప్రధాని మోడీ సర్కార్ తీసుకున్న పెద్ద నోట్ల రద్దే పెద్ద దుమారాన్ని రేపింది. ఇప్పటికి దేశ ఆర్థిక వ్యవస్థ కోలుకోలేకపోయిందని ఆర్థిక నిపుణులంటున్నారు. ఈ క్రమంలో మరోసారి రెండు వేల నోటును రద్దు చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.అప్పుడు 500,1000 నోట్లను రద్దు చేసిన ప్రభుత్వం 2000 నోటు తీసుకొచ్చి.. ఇప్పుడు దాన్ని రద్దుచేయడం అంటే .. అప్పుడు తప్పు చేసిందనే కదా.. అన్న భావన కల్గుతుంది. అయితే దేశంలో నల్లధనాన్ని నిర్మూలిస్తామని, విదేశీ బ్యాంకులలో దాచుకున్న బ్లాక్ మనీని తీసుకొచ్చి పేదల జన్ ధన్ ఖాతాలలో జమ చేస్తామని కబుర్లు చెప్పిన మోడీ సర్కార్ ఇప్పుడు ఏమని సమర్థించుకుంటుందని ప్రతిపక్షాలు ఫైర్ అవుతున్నాయి. అయితే రెండు వేల నోటును రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకొనే రద్దు చేశారని ఆర్థిక రంగ నిపుణులు, రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. కరెన్సీ నోట్లంటేనే ప్రజలకు అనుమానం కలిగే దుస్థితి ప్రభుత్వం కల్పించిందని విమర్శిస్తున్నారు. ఇక 500 నోట్లను కూడా రద్దు చేస్తారేమోనన్న భయం పుట్టింది. అయితే 2 వేల నోటు ను మోడీ సర్కార్ అసలు ఎందుకు తీసుకొచ్చింది.. ముద్రణ, నగదు సరఫరాకు ఎంత ఖర్చు అయింది.. ఆర్థిక వ్యవస్థపై ఎంత భారం పడుతుంది..ఇలాంటి దుబారా ఖర్చులు ఎందుకు చేస్తున్నారన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మరి దీనికి మోడీ సర్కార్ ఏం సమాధానం చెబుతుందో చూడాలి.

Σχόλια


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page