నారాయణపేట జిల్లా కృష్ణ మండలం రాష్ట్ర సరిహద్దులో కృష్ణా నదిపై నిర్మించిన కృష్ణ బ్రిడ్జిపై నుంచి రాకపోకలను అధికారులు నిలిపివేయనున్నారు. కృష్ణ బ్రిడ్జిపై వెళ్తున్న జాతీయ రహదారి-167 మరమ్మత్తులు చేసేందుకు అధికారులు నిర్ణయం తీసుకున్నారు.
నారాయణపేట జిల్లా కృష్ణ మండలం రాష్ట్ర సరిహద్దులో కృష్ణా నదిపై నిర్మించిన కృష్ణ బ్రిడ్జిపై నుంచి రాకపోకలను అధికారులు నిలిపివేయనున్నారు. కృష్ణ బ్రిడ్జిపై వెళ్తున్న జాతీయ రహదారి-167 మరమ్మత్తులు చేసేందుకు అధికారులు నిర్ణయం తీసుకున్నారు. దీంతో జనవరి 17వ తేదీన ఉదయం 5 గంటల నుండి 45రోజుల పాటు వాహనాల రాకపోకలు నిలిపివేస్తున్నట్లు రాయచూర్ కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. కర్ణాటక లోని రాయచూరు నుంచి తెలంగాణలోని హైదరాబాద్‌కు రాకపోకలు సాగించే వాహనాదారులు ఆంక్షలను గమనించాలని కోరారు.
ఇక కృష్ణ వంతెన ను కర్ణాటక ప్రభుత్వం మరమ్మత్తులు చేస్తున్న నేపథ్యంలో NH-167 రహదారిపై వెళ్లే వాహనాదాల కోసం తెలంగాణ పోలీసులు ప్రత్యామ్నాయ మార్గాలపై ఫోకస్ పెట్టారు. రాయచూర్ కి వెళ్ళే వారు మరికల్ సబ్ స్టేషన్ నుండి చిత్తనూరు, అమరచింత జూరాల డ్యాం, గద్వాల్ మీదుగా కేటీ దొడ్డి రాయచూర్ కు డైవర్షన్ చేశారు. కృష్ణా, మక్తల్, మరికల్ పోలీస్ స్టేషన్ పరిధిలో వాహనదారులకు అవగాహన నిమిత్తం ఫ్లెక్సీలను ఏర్పాటు చేయనున్నారు.