top of page

🎬 టైగర్ నాగేశ్వరరావు చిత్రం లో 'హేమలతా లవణం' పాత్రలో రేణూ దేశాయ్ 🎬

రవితేజ ప్రధాన పాత్రలో టైగర్ నాగేశ్వరరావు 🎥 వంశీకృష్ణ దర్శకత్వంలో అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మాణం 🎥 ప్రముఖ సంఘ సంస్కర్త పాత్రలో నటిస్తున్న రేణూ దేశాయ్ 🎥 రేమాస్ మహారాజా రవితేజ, నుపుర్ సనన్, గాయత్రి భరద్వాజ్ నటిస్తున్న చిత్రం 'టైగర్ నాగేశ్వరరావు' 🎥

పేరుమోసిన స్టూవర్ట్ పురం దొంగ టైగర్ నాగేశ్వరరావు జీవితం ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుస్తున్నారు. రేణూ దేశాయ్ లుక్ పంచుకున్న చిత్రబృందం అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ పై వంశీకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రముఖ నటి రేణూ దేశాయ్ ఓ ఆసక్తికర పాత్ర పోషిస్తున్నారు. ప్రముఖ సంఘ సంస్కర్త హేమలతా లవణం పాత్రలో ఆమె నటిస్తున్నారు. 🎥 కాగా, టైగర్ నాగేశ్వరరావు చిత్ర ట్రైలర్ ను అక్టోబరు 3న విడుదల చేయనున్నారు. 🎥 ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ముంబయిలో ఘనంగా నిర్వహించేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది. 🎬 దసరా సీజన్ లో అక్టోబరు 20న టైగర్ నాగేశ్వరరావు చిత్రం వరల్డ్ వైడ్ రిలీజ్ కానుంది. 🎥 కాగా, ఈ చిత్రాన్ని తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లోనూ తెరకెక్కిస్తున్నారు. 🌍 రవితేజ కెరీర్లోనే ఇది భారీ బడ్జెట్ చిత్రంగా నిలవనుంది. 🎶 అంతేకాదు, రవితేజకు ఇదే తొలి పాన్ ఇండియా చిత్రం. 🎵 టైగర్ నాగేశ్వరరావు చిత్రానికి ఏఆర్ రెహమాన్ మేనల్లుడు జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. 🎵


Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page