top of page

బెంగళూరు రేవ్ పార్టీ కేసులో హేమకు ఊరట 🎉

బెంగళూరు రేవ్ పార్టీ కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటోన్న ప్రముఖ నటి హేమకు భారీ ఊరట లభించింది. ప్రస్తుతం జ్యూడిషియల్ కస్టడీలో భాగంగా పరప్ప అగ్రహార జైలులో ఉన్న ఆమెకు బుధవారం (జూన్ 12) బెయిల్ మంజూరైంది. బెంగళూరు రూరల్ ఎన్డీపీఎస్ ప్రత్యేక కోర్టు హేమకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. హేమ నుంచి ఎలాంటి డ్రగ్స్‌ లభించలేదని, చాలా రోజుల తర్వాత వైద్య పరీక్షలు నిర్వహించామని హేమ తరఫు న్యాయవాది మహేష్ కిరణ్ శెట్టి వాదించారు. దీంతో షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయాలని కోర్టు ఆదేశించింది.

కొన్ని రోజుల క్రితం బెంగళూరు పోలీసులు జీ ఆర్ ఫామ్‌హౌస్‌పై దాడి చేసినప్పుడు నటి హేమ కూడా పట్టుబడింది. అయితే ఈ వార్త బయటకు రాగానే, హేమ అదే ఫామ్‌హౌస్ నుండి వీడియోను రికార్డ్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ వీడియో ద్వారా తాను హైదరాబాద్‌లో ఉన్నట్లు చూపించే ప్రయత్నం చేసిందీ సీనియర్ నటి. బెంగళూరు పోలీసులు హేమ రేవ్ పార్టీలో పాల్గొన్నట్లు, మరికొంతమంది టాలీవుడ్ సెలబ్రిటీలను ఈ పార్టీకి తరలించే ప్రయత్నం చేసినట్లు ధ్రువీకరించారు. దీంతో విచారణకు హాజరు కావాలని నోటీసులు కూడా పంపించారు. మొదటి సారి నోటీసులకు అనారోగ్య కారణాలతో హాజరు కాలేదు. రెండోసారి నోటీసులు జారీ చేయడంతో, బుర్ఖా ధరించి విచారణకు హాజరైంది. ఆ తర్వాత కోర్టు ఆమెకు 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించింది. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కూడా ఆమె సభ్యత్వాన్ని రద్దు చేసింది. ఇప్పుడు బెయిల్ లభించడం కొంత ఊరటను అందించింది.


Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page