top of page

వాయిస్‌ అసిస్టెంట్‌ సపోర్ట్‌తో రెడ్‌మీ వాచ్‌.. ధర ఎంతో తెలుసా.?

చైనాకు చెందిన ఎలక్ట్రానిక్‌ దిగ్గజం రెడ్‌మీ ఈ ఏడాది ప్రాంరభంలో రెడ్‌మీ వాచ్‌ 4 పేరుతో కొత్త వాచ్‌ను తీసుకొచ్చింది. అయితే తాజాగా ఈ వాచ్‌కు అప్‌టేడ్ వెర్షన్‌ను లాంచ్‌ చేసింది.

అమెజాన్‌ అలెక్సా వాయిస్‌ అసిస్టెంట్‌ను అందిస్తోంది. ఇందుకోసం 2.2.80 వెర్షన్‌ను తీసుకొచ్చారు. ఈ స్మార్ట్ వాచ్‌ వాయిస్‌ కంట్రోల్‌ ఫీచర్‌ సహాయంతో యూజర్లు అలారమ్‌ సెట్ చేసుకోవచ్చు, ఇంట్లో ఉండే అటోమేషన్‌ డివైజ్‌లను ఆపరేట్ చేసుకోవచ్చు. రిమైండర్స్‌తో పాటు మరెన్నో చేసుకోవచ్చు. ఇక ఈ వాచ్‌ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 1.97 ఇంచెస్‌తో కూడిన రెక్టాంగులర్‌ అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించారు. 60 హెచ్‌జెడ్‌ రిఫ్రెష్‌రేట్, 600 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌ ఈ స్క్రీన్‌ సొంతం. రెడ్‌మీ వాచ్‌లో హార్ట్ రేట్‌ మానిటరింగ్, బ్లూడ్‌ ఆక్సిజన్‌ వంటి హెల్త్ ఫీచర్లతో పాటు 150కిపై స్పోర్ట్స్‌ యాక్టివిటీస్‌ను అందించారు. గైరోస్కోప్‌, జీపీఎస్‌ ఫంక్షనాలిటీ వంటి ఎన్నో అధునాతన ఫీచర్లను ఇందులో అందించారు. ఇక ఈ వాచ్‌లో బ్లూటూత్‌ కాలింగ్ కోసం ఇన్‌బుల్ట్‌గా స్పీకర్‌ను అందించారు. 5 ఏటీఎమ్‌ వాటర్‌ రెసిస్టెన్స్‌ ఈ వాచ్‌ సొంతం. అలాగే ఇందులో 470 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీని అందించారు. ఈ వాచ్‌ను ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 20 రోజులు నాన్‌స్టాప్‌గా పనిచేస్తుంది. ఈ వాచ్‌ ధర రూ. 8000గా నిర్ణయించారు.

bottom of page