బెంగళూరు రేవ్ పార్టీ కేసు (Bengaluru Rave Party)లో పోలీసులు ఫైనల్‌గా ఛార్జిషీట్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. టాలీవుడ్ నటి హేమ (hema) డ్రగ్స్ తీసుకున్నట్టు నివేదికలో పేర్కొన్న పోలీసులు ఎండీఎంఏ మెడికల్ రిపోర్ట్‌ను కూడా జత చేశారు. ఈ కేసులో నటి హేమతోపాటు 88 మంది డ్రగ్స్ తీసుకున్నారని పోలీసులు వివరించారు. చార్జీషీట్‌లో రేవ్ పార్టీ నిర్వాహకులుగా 9 మందిని పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో హేమ మీడియాతో మాట్లాడుతూ.. చార్జీషీట్‌లో నా పేరున్నట్టు తెలిసింది. నేను డ్రగ్స్ తీసుకోలేదు. నేను అసలు శాంపిల్సే ఇవ్వలేదు. నేను డ్రగ్స్ తీసుకున్నట్టు నిరూపిస్తే దేనికైనా సిద్ధమని చాలెంజ్ విసిరింది. ఓ వైపు హేమ డ్రగ్స్ తీసుకున్నట్టు పోలీసులు పేర్కొనడం.. మరోవైపు హేమ మాత్రం డ్రగ్స్ తీసుకోలేదంటూ చాలెంజ్ చేయడంతో.. ఈ వ్యవహారం ఎటువైపు వెళ్తుందనేది సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ఈ కేసులో హేమ ఇప్పటికే బెంగళూరు పరప్పన అగ్రహార జైలులో 14 రోజులు జ్యుడీషియల్ కస్టడీలో ఉందని తెలిసిందే. అనంతరం బెంగళూరు రూరల్ ఎన్డీపీఎస్ స్పెషల్ కోర్టు ఆమెకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఇక డ్రగ్స్ కేసులో పట్టుబడటంతో మా (మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) హేమను సస్పెండ్ చేయగా.. ఆగస్టులో ఆ సస్పెన్షన్‌ను ఎత్తివేసింది.