top of page
Suresh D

RCB పేరు మారుతోంది..🏏🤔

ఐపీఎల్ 2024కు ముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు కీలక అప్ డేట్ ఇచ్చింది. ఈ సీజన్‌లో తమ ఫ్రాంఛైజీ పేరులో మార్పులు చేయనున్నట్లుగా హింట్ ఇచ్చింది.

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో అత్యంత ప్రేక్షకాదరణ కలిగిన జట్లలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఒకటి. ఇందులో ఏమాత్రం డౌట్ అవసరం లేదు. లీగ్ ప్రారంభం నాటి నుంచీ పాల్గొంటున్న ఈ జట్టు ఇప్పటివరకు ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేకపోయింది. అయితేనేం.. ఆ జట్టు ఫ్యాన్స్ తీరే వారు. తమ అభిమాన జట్టు ఎక్కడ మ్యాచ్ ఆడినా.. సపోర్ట్ ఇస్తూనే ఉంటారు. ప్రస్తుతం జరుగుతున్న మహిళల ప్రీమియర్ లీగ్‌లోనూ ఈ ఫ్రాంఛైజీ జట్టుకు అదే రేంజ్‌లో సపోర్ట్ లభిస్తోంది.అయితే గత 16 ఏళ్లుగా ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేకపోయిన ఆర్సీబీ.. ఈ సారి మాత్రం పేరులో మార్పు చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు కాంతారా ఫేమ్ రిషభ్ శెట్టితో ఓ వీడియో చేయించి హింట్ ఇచ్చింది.ఇంగ్లీష్‌లో ఆర్సీబీ సోషల్‌ మీడియాతో పాటు ఏ వేదికపై అయినా తమ జట్టు పేరు రాసేప్పుడు "Royal Challengers Bangalore" అని ఉండటం మనం గమనించే ఉంటాం. అయితే ఇప్పట్నుంచి Bangalore పదం ప్లేసులో ఇంగ్లీష్‌లో Bengaluru అని రాయనున్నట్లు తెలుస్తోంది. రిషభ్ శెట్టితో చేయించిన యాడ్‌ ద్వారా ఈ విషయం స్పష్టమవుతోంది.🏏


bottom of page