top of page

🏦 నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలపై ఆర్బీఐ నిఘా..

🏦 ఈ మధ్య కాలంలో బ్యాంకులే కాకుండా ప్రైవేట్‌ నాన్స్‌ ఫైనాన్సింగ్‌ సంస్థలు రుణాలు ఇవ్వడంలో వేగవంతం చేసింది. ఈ నాన్‌ ఫైనాన్సింగ్‌ కంపెనీలు సులభంగా రుణాలు అందిస్తున్నాయి.

సిబిల్‌ స్కోర్‌ తక్కువగా ఉన్న అధిక వడ్డీలకు రుణాలు అందించేందుకు ముందుకు వస్తున్నాయి. దీంతో చాలా మంది రుణాలు తీసుకునేందుకు ముందుకు వస్తున్నారు. ఈ రోజుల్లో గృహ రుణాలు, వ్యక్తిగత రుణాలు తీసుకునే వారి సంఖ్య భారీగానే పెరిగిపోయింది. ఇక పండుగల సీజన్‌కు ముందు భారతీయ రిజర్వ్ బ్యాంక్‌ (RBI) ఒక విషయం తెలియజేసింది.ఇది ప్రజలు రుణాలు తీసుకోవడం కష్టతరం చేస్తుంది. దేశంలో వ్యక్తిగత రుణాలు తీసుకునే వారి ధోరణిపై RBI ఆందోళన వ్యక్తం చేసింది. దీని కోసం బ్యాంకులు, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలను (NBFC) గట్టిగా మందలించింది.

📊 ఇటీవల, తన ద్వైమాసిక ద్రవ్య విధాన సమీక్షను సమర్పిస్తున్నప్పుడు, RBI గవర్నర్ శక్తికాంత దాస్ దేశంలో వ్యక్తిగత రుణాల పెరుగుదలపై ఆందోళన వ్యక్తం చేశారు. బ్యాంకులు, ఎన్‌బిఎఫ్‌సిల కొన్ని రకాల వ్యక్తిగత రుణాలలో చాలా వేగంగా వృద్ధి కనిపిస్తోందని ఆయన అన్నారు. ఇది సమస్యలను సృష్టించవచ్చు. ఈ తీరుపై రిజర్వ్ బ్యాంక్ నిఘా ఉంచిందని ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు. ఇందుకోసం తన నిఘా వ్యవస్థను పటిష్టం చేసింది. ఇది మాత్రమే కాదు, సెంట్రల్ బ్యాంక్ బ్యాంకులు, ఎన్‌బిఎఫ్‌సిలు తమ అంతర్గత నిఘా యంత్రాంగాలను బలోపేతం చేయాలని కూడా కోరింది. 💼📈🏛️

Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page