top of page

టైగర్ నాగేశ్వరరావు’ నుంచి నాజర్ ఫస్ట్ లుక్ రిలీజ్..🎥🎞️

మాస్ మహరాజ్ రవితేజ హీరోగా, వంశీ దర్శకత్వంలో రూపొందుతున్న ప్రతిష్టాత్మక పాన్ ఇండియన్ చిత్రం ‘టైగర్ నాగేశ్వరరావు’. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి భారీగా అంచనాలు నెలకొన్నాయి. దసరా కానుకగా అక్టోబర్ 20న ఈ సినిమా పలు భాషల్లో విడుదలకానుంది.

మాస్ మహరాజ్ రవితేజ హీరోగా, వంశీ దర్శకత్వంలో రూపొందుతున్న ప్రతిష్టాత్మక పాన్ ఇండియన్ చిత్రం ‘టైగర్ నాగేశ్వరరావు’. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి భారీగా అంచనాలు నెలకొన్నాయి. దసరా కానుకగా అక్టోబర్ 20న ఈ సినిమా పలు భాషల్లో విడుదలకానుంది. గ్రిప్పింగ్ టీజర్, చార్ట్‌ బస్టర్ పాటలతో టైగర్ నాగేశ్వర్ రావు చిత్రం నేషనల్ వైడ్ గా హ్యూజ్ బజ్ క్రియేట్ చేస్తుంది. ఈ సినిమాతో రవితేజ పాన్ ఇండియన్ స్టార్ గా మారబోతున్నారు. సినిమా విడుదల సమయం దగ్గర పడుతుండడంతో చిత్రబృందం ప్రచార కార్యక్రమాలు ముమ్మరం చేసింది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన అదిరిపోయే అప్ డేట్ ఇచ్చింది.

ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి రేణు దేశాయ్​ ఫస్ట్ లుక్ ను మేకర్స్ విడుదల చేశారు. ​ హేమలత లవణంగా ఆమెను పరిచయం చేశారు. తాజాగా ఈ సినిమాలోని నాజర్​ లుక్​ ను రిలీజ్ చేశారు. గజ్జల ప్రసాద్​గా ఆయనను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ పోస్టర్ కు ‘ది బ్యాక్​ బోన్​ ఆఫ్​ స్టువర్టు​పురం’ అని క్యాప్షన్ పెట్టారు. ఈ పోస్టర్ లో నాజర్ పొడవాటి జట్టు, పెద్ద మీసాలతో సరికొత్తగా కనిపిస్తున్నారు. చేతిలో చుట్టతో ఆకట్టుకుంటున్నారు. 🎥🎞️


Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page