top of page

రవితేజ – శ్రీలీల కొత్త సినిమా ఓపెనింగ్..

మాస్ మహారాజ రవితేజ వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు! ప్రస్తుతం రవితేజ హరీష్ శంకర్ దర్శకత్వంలో "మిస్టర్ బచ్చన్" సినిమా చేస్తున్నాడు. ఇటీవల రవితేజ 75వ సినిమా RT75ని ప్రకటించి, ఈ సినిమాకి సంబంధించిన పూజా కార్యక్రమం జరిగింది.

"సామజవరగమన" పేరుతో రాబోతున్న ఈ సినిమా కామెడీ ఎంటర్టైన్మెంట్ గా ప్రేక్షకులను అలరించనుంది. రచయిత భాను బొగ్గవరపు ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. సితార ఎంటర్టైన్మెంట్ నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కనుంది.

రవితేజ మరియు శ్రీలీల కలిసి నటించిన "ధమాకా" సినిమా భారీ విజయం సాధించి, రవితేజ కెరీర్ లో మొదటి 100 కోట్ల సినిమాగా నిలిచింది. మళ్లీ ఈ ఇద్దరూ జంటగా నటించనుండటంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. నేడు ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరగగా, ప్రస్తుతం ఆ ఫోటోలు వైరల్ గా మారాయి. "మిస్టర్ బచ్చన్" షూటింగ్ త్వరలోనే పూర్తికానుంది. ఆ తర్వాత ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలవ్వనుంది.

RT75 సినిమాలో రవితేజ పక్కా తెలంగాణ స్లాంగ్ తో రాబోతున్నట్టు తెలుస్తుంది. అలాగే ఈ సినిమాని 2025 సంక్రాంతికి విడుదల చేస్తామని ప్రకటించారు. ఇప్పటికే సంక్రాంతి 2025కి చిరంజీవి, వెంకటేష్, నాగార్జున, దిల్ రాజు వంటి పలువురు కూడా వాళ్ళ సినిమాలని ప్రకటించారు. ఆ బరిలో ఇప్పుడు రవితేజ కూడా చేరాడు. మరి చివరివరకు సంక్రాంతి 2025 బరిలో ఎవరి సినిమాలు ఉంటాయో చూడాలి.

Comentários


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page