top of page

🎬 రవితేజ ‘ఈగల్’ టీజర్ రిలీజ్.. 🎥

🌟 తాజాగా విడుదలైన టీజర్‎లో రవితేజ గురించి గొప్పగా.. ఒక కథలా చెప్పారు. ముందుగా రవితేజ లుంగీ కట్టి.. తుపాకీ చేత పట్టి మరింత మాస్‏గా కనిపించారు. 🌠

ముందుగా పూర్తిగా చీకటిలో బాంబ్ పేలిన ప్రదేశాలను చూపిస్తూ.. “కొండలో లావాను కిందకు పిలవకు.. ఊరు ఉండదు.. నీ ఊనికి ఉండదు” అంటూ రవితేజ వాయిస్ తో టీజర్ స్టార్ట్ అయ్యింది. 🗣️ అడవిలో ఉంటాడు.. నీడై తిరుగుతుంటాడు.. కనిపించడు.. కానీ వ్యాపించి ఉంటాడు అంటూ అవసరాల శ్రీనివాస్ చెప్పడం.. ఆ తర్వాత “ఇది విధ్వంసం మాత్రమే.. తర్వాత చూడబోయేది విశ్వరూపమే” అంటూ నవదీప్ చెప్పిన డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. 🎭

🎞️ రవితేజ గురించి అనుపమ తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. జనాలకు కట్టు కథ.. ప్రభుత్వాలు కప్పెట్టిన కథ.. ఒక వ్యక్తి అన్నిచోట్లు ఉంటాడు అంటూ వచ్చే డైలాగ్స్ సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేశాడు. 📣 ఇక టీజర్‏లో వచ్చే బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయింది. ఇందులో అనుపమ పరమేశ్వరన్, కావ్య థాపర్ హీరోయిన్లుగా నటిస్తుండగా.. మధుబాల, నవదీప్, అవసరాల శ్రీనివాస్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. 🌟 ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 13న రిలీజ్ చేయనున్నారు. 🎉


Коментарі


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page