top of page
Suresh D

అమితాబ్ ఇంటి పేరే రవితేజ సినిమా టైటిల్🎥🌟

మాస్ మహారాజా రవితేజ కొత్త సినిమా ఈ రోజు పూజతో మొదలైంది. ఆయన కథానాయకుడిగా బ్లాక్ బస్టర్ డైరెక్టర్ హరీష్ శంకర్ రెండు సినిమాలు చేశారు.

మాస్ మహారాజా రవితేజ కొత్త సినిమా ఈ రోజు పూజతో మొదలైంది. ఆయన కథానాయకుడిగా బ్లాక్ బస్టర్ డైరెక్టర్ హరీష్ శంకర్ రెండు సినిమాలు చేశారు. అందులో ఒకటి 'షాక్'... మరొకటి 'మిరపకాయ్'. సుమారు పదమూడు సంవత్సరాల తర్వాత మళ్ళీ వీళ్ళిద్దరూ కలిసి సినిమా చేస్తున్నారు.రవితేజ, హరీష్ శంకర్ కలయికలో మూడో సినిమా ఈ రోజు హైదరాబాద్ సిటీలోని ఓ ప్రయివేట్ స్టూడియోలో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా సినిమా ప్రారంభమైంది. ఈ చిత్రానికి 'మిస్టర్ బచ్చన్' టైటిల్ ఖరారు చేశారు.

బాలీవుడ్ మెగాస్టార్, బిగ్ బి అమితాబ్ బచ్చన్ అంటే రవితేజకు ఎంతో అభిమానం. ఇంతకు ముందు పలు సందర్భాల్లో ఆ విషయం చెప్పారు. 'కిక్'లోని ఓ సీనులో అమితాబ్ తరహాలో డ్రస్సింగ్ కావడమే కాదు... ఆయనను ఇమిటేట్ చేశారు రవితేజ. ఇప్పుడు తన కొత్త సినిమాకు అమితాబ్ ఇంటి పేరును టైటిల్‌గా ఫిక్స్ చేశారు. 'మిస్టర్ బచ్చన్' అనేది సినిమా టైటిల్ అయితే... 'నామ్ తో సునా హోగా' అనేది క్యాప్షన్. 

'మిస్టర్ బచ్చన్' టైటిల్ అనౌన్స్ చేయడంతో పాటు విడుదల చేసిన రవితేజ ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తే... అమితాబ్ బచ్చన్ ఐకానిక్ పోజ్ గుర్తుకు వస్తుంది. ఆ వెనుక నటరాజ్ థియేటర్ కనబడుతోంది. మరి, ఈ సినిమాలో అమితాబ్ అభిమానిగా రవితేజ కనిపిస్తారా? లేదంటే సినిమా ప్రేమికుడిగానా? అనేది తెలియాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయక తప్పదు.🎥🌟


bottom of page