top of page
Suresh D

రవితేజ థ్రిల్లర్ యాక్షన్ డ్రామా ‘ఈగల్’ మూవీ ఫస్ట్ డే ఎంత వసూలు చేసిందంటే.. 🎬

రవితేజ ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ హిట్ పడిందంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. ఇప్పటి దాక పాజిటివ్ రివ్యూస్ అందుకున్న ఈ మూవీ ఫస్ట్ డే ఎంతవరకు వసూళు చేసిందో తెలుసుకోవాల్సిందే. 🎥

మాస్ మాహారాజా రవితేజ నటించిన సినిమా ‘ఈగల్’ ఈ శుక్రవారం అడియన్స్ ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 9న గ్రాండ్ గా విడుదలైన ఈ మూవీ ఉదయం నుంచి సూపర్ హిట్ రెస్పాన్స్ అందుకుంది. ఈ మాస్ యాక్షన్ కమర్షియల్ చిత్రాన్ని డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కించిన విధానంపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇందులో రవితేజను చూపించిన విధానం.. ఆయన పాత్రకు ఇచ్చిన ఎలివేషన్స్ మైండ్ బ్లాంక్ అంటూ అడియన్స్ రివ్యూ కూడా ఇచ్చేశారు. దీంతో రవితేజ ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ హిట్ పడిందంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. ఇప్పటి దాక పాజిటివ్ రివ్యూస్ అందుకున్న ఈ మూవీ ఫస్ట్ డే ఎంతవరకు వసూళు చేసిందో తెలుసుకోవాల్సిందే. 🎥

విడుదలైన మొదటి రోజే ఈగల్ సినిమా దేశవ్యాప్తంగా మొత్తం రూ.6 కోట్లు రాబట్టింది. తెలుగు రాష్ట్రాల్లో శుక్రవారం మొత్తం 37.48 శాతం ఆక్యుపెన్సీని కలిగి ఉంది. అలాగే హిందీలో ఆక్యుపెన్సీ 7.46 శాతం నమోదు అయ్యింది. ఇక ఈ వీకెండ్ శని, ఆదివారం రెండు రోజుల్లో ఈగల్ కలెక్షన్స్ మరింత పెరిగే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్, కావ్య థాపర్ హీరోయిన్లుగా నటించగా.. అజయ్ ఘోష్, శ్రీనివాస్ అవసరాల, నవదీప్, మధుబాల, ప్రణీత పట్నాయక్ కీలకపాత్రలు పోషించారు. 🌟

bottom of page