top of page
MediaFx

రేపటి నుంచి వారి రేషన్ కార్డులు రద్దు?


భారతీయ పౌరులకు అత్యంత ముఖ్యమైన కార్డులలో రేషన్ కార్డు ఒకటి. ఈ గుర్తింపు కార్డు ద్వారా దేశంలోని కోట్లాది మంది ప్రజలు ప్రభుత్వం నుండి ఉచితంగా లేదా చాలా చౌకగా ఆహార పదార్థాలను పొందుతున్నారు.మీరు దేశంలోని రేషన్ వినియోగదారులలో ఒకరు అయితే, ఈ రోజు మీరు ఈ విషయాన్ని కచ్చితంగా తెలుసుకోవాల్సిందే. ప్రభుత్వం నుంచి రేషన్ కార్డుపై పెద్ద అప్‌డేట్‌ వస్తోంది. భారత ప్రభుత్వం వచ్చే నెల నుండి మిలియన్ల కొద్దీ రేషన్ కార్డులను రద్దు చేయొచ్చు.6 నెలలు లేదా అంతకంటే ఎక్కువ కాలం పాటు రేషన్ ద్వారా ఆహార ధాన్యాలు సేకరించని వారి రేషన్ కార్డును రద్దు చేయవచ్చు. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం త్వరలో మార్గదర్శకాలను విడుదల చేసే అవకాశం ఉందని నివేదికలు పేర్కొంటున్నాయి.ఈ మార్గదర్శకాలను అమలు చేసేందుకు ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోంది. అర్హులైన వారికి కూడా రేషన్ సరుకులు అందేలా కృషి చేస్తున్నారు.రేషన్‌లో అనేక మంది అనర్హులు లబ్ధి పొందుతున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి అనర్హులను గుర్తించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద, పేద ప్రజలకు రేషన్ ద్వారా ఆహార పదార్థాల పంపిణీ కరోనా కాలం నుండి ప్రారంభమైంది.

అయితే ఆర్థిక స్తోమత ఉన్నవారు చాలా మంది ఈ పథకం కింద ప్రయోజనం పొందుతున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి అనర్హుల జాబితాను ప్రభుత్వం సిద్ధం చేస్తోంది. అందుకని, ఈ అనర్హులు అతి త్వరలో పథకం నుండి వైదొలిగే అవకాశం ఉంది.అనర్హులకు ఉచితంగా గోధుమలు, బియ్యం, ఇతర ధాన్యాలు ఇవ్వడంపై ప్రభుత్వానికి ఫిర్యాదులు కూడా ఉన్నాయి. ఈ పరిస్థితిని పరిష్కరించడానికి, కేంద్ర ప్రభుత్వ ఆహార వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రజా పంపిణీ కేంద్రాల కోసం కొత్త విధానాలతో వస్తోంది. అటువంటి ఫిర్యాదు వస్తే, డీలర్ లైసెన్స్ రద్దు చేయబడవచ్చు.మీడియా నివేదికల ప్రకారం, అనర్హులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోనుంది. అంటే వారి రేషన్ కార్డులను రద్దు చేసే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.ప్రధాన్ మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద పథకాన్ని సీనియర్ ప్రభుత్వ అధికారులు సమీక్షిస్తున్నారు. మీడియా కథనాల ప్రకారం, పథకంలో కొన్ని లోపాలు ఉన్నట్లు తెలిసింది. ఆ తర్వాత మే 1 నుండి రేషన్ పంపిణీ వ్యవస్థలో మార్పులు అమలు చేయాలని ఆలోచిస్తున్నారు.ప్రస్తుతం లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉంది. అందుకే అనౌన్స్ చేయడం కుదరదు కానీ, అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయని సమాచారం.



Comments


bottom of page