top of page
Suresh D

నేటి రాశి ఫలాలు.. ఈ 7 రాశుల వారికి అనుకూల ఫలితాలు ఉన్నాయి🌟🔮

నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ15.02.2024 గురువారం మేషరాశి నుంచి మీన రాశి వరకు12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.🌟🔮

మేష రాశి

మేష రాశి వారికి ఈరోజు మీకు అనుకూలంగా లేదు. కొన్ని వ్యవహారాలకు సంబంధించి చర్చలు మందగిస్తాయి. అస్తుల విషయంలో ఇబ్బందికర పరిస్థితులుంటాయి. అయితే క్రమేపీ అనుకూలత ఉంటుంది. చిన్ననాటి విషయాలను తలచుకుంటారు. బంధుగణం మీపై మరింత ప్రేమ చూపుతారు. వ్యాపారాలలోని వారికి మరింత వెసులుబాట్లు కలుగుతాయి. ఉద్యోగులు విధులు సకాలంలో చక్కదిద్దుతారు. ఆరోగ్య విషయాలపై జాగ్రత్తలు తీసుకోవాలి. రాజకీయ నాయకులకు ఆకస్మిక విదేశీ పర్యటనలు ఉంటాయి.  దక్షిణామూర్తిని చూడడం, దక్షిణామూర్తి స్తోత్రాలను పఠించడం చేత సమస్యలు తొలగి శుభఫలితాలు కలుగుతాయి.

వృషభ రాశి

వృషభ రాశి వారికి ఈరోజు మీకు అనుకూల ఫలితాలు ఉన్నాయి. కొత్త వాహనాలు కొంటారు. ఇంటి నిర్మాణాలపై దృష్టిసారిస్తారు. వివాహ ప్రయత్నాల్లో పురోగతి ఉండును. నిరుద్యోగులకు అవకాశాలు. వ్యాపారులు వ్యాపారంలో రాణిస్తారు. ఉద్యోగులకు సంతోషకరమైన విషయాలు తెలుస్తాయి. కళాకారులు, క్రీడాకారులు, రచయితలకు తగిన గుర్తింపు ఉండును. ఆస్తి పంపకాలు ఉంటాయి. ఈరోజు మరింత శుభఫలితాలు పొందడం కోసం దత్తాత్రేయుని పూజించాలి. శ్రీగురుచరిత్ర పఠించడం దత్తాత్రేయ స్తోత్రాన్ని పఠించడం వలన శుభఫలితాలు కలుగుతాయి.

మిథున రాశి

మిథున రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. అనుకున్న పనులు నిదానంగా సాగుతాయి. ఆస్తుల విషయంలో అగ్రిమెంట్లు వాయిదా వేస్తారు. బాధ్యతలు మీద పడినా అందోళన చెందక ముందుకు సాగుతారు. శారీరక రుగ్మతలు బాధిస్తాయి. ఒక సమాచారం ఉపయోగకరంగా ఉంటుంది. వ్యాపారులు పెట్టుబడులకు తొందరపడకుండా నిదానం పాటించాలి. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు మీదపడతాయి. విందులు వినోదాల్లో పాల్గొంటారు. నూతన వ్యక్తుల పరిచయం. ఈరోజు మరింత శుభఫలితాలు పొందడం కోసం దత్తాత్రేయుని పూజించాలి. బ్రాహ్మణులకు గానీ ముత్తైదువులకు గానీ తాంబూలం, శనగలను దానమివ్వడం మంచిది. శనగలతో చేసిన ప్రసాదాన్ని నివేదన చేసి అది ప్రసాదంగా పంచిపెట్టాలి.

కర్కాటక రాశి

కర్కాటక రాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్తం. జీవిత భాగస్వామి సోదరులతో సఖ్యత అవసరం. ఆస్తుల వివాదాలు కొలిక్కివస్తాయి. రాబడికి లోటు లేకున్నా ఇతరులకు ఇచ్చిన హామీలకు బకాయిలు చెల్లించాల్సి వస్తుంది. అప్పులు తీరతాయి. తొందరపాటు మాటలకు స్వస్తి చెప్పి అందర్నీ ఆకట్టుకొనే ప్రయత్నం చేస్తారు. మీ నిర్ణయాల్లో పొరపాట్లు దొర్లకుండా జాగ్రత్తపడాలి. వ్యాపారులకు కలసివచ్చే సమయం. ఉద్యోగులు మెరుగ్గా తమ విధులు నిర్వహిస్తారు. దక్షిణామూర్తి స్తోత్రాలను పఠించడం చేత సమస్యలు తొలగి శుభఫలితాలు కలుగుతాయి.

సింహ రాశి

సింహ రాశి వారికి నేటి రాశి ఫలం ప్రకారం మధ్యస్థం నుండి అనుకూలం. అనుకున్న పనులు కొన్ని శ్రమానంతరం పూర్తవుతాయి. పరిమితులకు మించిన ఖర్చులుంటాయి. ఏదో విధంగా సొమ్ము సమకూరే సూచనలున్నాయి. ప్రయాణాలతో ఉక్కిరిబిక్కిరి అవుతారు. స్థిరాస్తి విషయంలో ఆశాజనక ఒప్పందాలు ఉంటాయి. కీలక వ్యక్తి ద్వారా అవసరమైన సాయం అందుతుంది. వాహన, గృహ యోగాలుఉన్నాయి. వ్యాపారాలలోని వారికి చివరలో మరింత అనుకూలం. ఉద్యోగులకు ఉన్నతాధికారుల నుండి పిలుపు రావచ్చు. ఈరోజు మరింత శుభఫలితాలు పొందడం కోసం దత్తాత్రేయుని పూజించాలి. శ్రీగురుచరిత్ర పఠించడం, దత్తాత్రేయ స్తోత్రాన్ని పఠించడం వలన శుభఫలితాలు కలుగుతాయి.

కన్యా రాశి

కన్యా రాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. కొన్ని వ్యవహారాలు విజయవంతమవుతాయి. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. ఇంతకాలం మిమ్మల్ని తేలిగ్గా తీసుకున్నా బంధువులు మీ నైపుణ్యం గుర్తిస్తారు. ఆదాయంలో లోటు ఉండదు. వాహనాలు కొంటారు. విద్యార్థులకు విజయాలుంటాయి. ఇతరులతో మాట్లాడే సందర్భం, ఖర్చుచేసే విషయం, ఆరోగ్యంపై జాగ్రత్తలు పాటించాలి. వ్యాపారాల్లో మధ్యస్థ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగులకు ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. కన్యా రాశి వారు మరింత శుభఫలితాలు పొందడం కోసం బృహస్పతి అనుగ్రహం కోసం బ్రాహ్మణులకు గాని ముత్తైదువులకు గానీ, శనగలను గానీ దానమివ్వడం మంచిది. 

తులా రాశి

తులా రాశి వారికి ఈ రోజు మీకు అనుకూల ఫలితాలున్నాయి. ఏకార్యం చేపట్టినా విజయవంతమవుతుంది. ఆప్తులు, శ్రేయోభిలాషులు మీ సలహాలకు విలువ ఇస్తారు. ఆస్తుల పంపకాలలో ఇబ్బందులు తొలగు అవకాశము. విద్యార్థులు, నిరుద్యోగులకు ఊహించని అవకాశాలు. అనుకున్న ఆదాయం ఉండును. ఆత్మవిశ్వాసం, పట్టుదలతో లక్ష్యాలు సాధిస్తారు. అందరిలోనూ ప్రత్యేక గుర్తింపు. భూములు, వాహనాలు కొంటారు. వ్యాపారులకు సంతోషదాయకం. ఉద్యోగులకు మార్పులు అనివార్యం. దక్షిణామూర్తిని చూడడం, దక్షిణామూర్తి స్తోత్రాలను పఠించడం చేత సమస్యలు తొలగి శుభఫలితాలు కలుగుతాయి.

వృశ్చిక రాశి

వృశ్చిక రాశి వారికి ఈరోజు మీకు అనుకూల ఫలితాలు ఉన్నాయి. ముఖ్య వ్యవహారాలను సొంతంగా పూర్తిచేస్తారు. అనుకున్న సమయానికి డబ్బు అందుతుంది. బంధువర్గం మీపట్ల ప్రేమానురాగాలు కురిపిస్తారు. ఉద్యోగాన్వేషణలో విజయం సాధిస్తారు. ఇంటి నిర్మాణాలలో ఆటంకాలు తొలగి ముందుకు సాగుతారు. విద్యార్థులకు విదేశీ ఉద్యోగావకాశాలు లభించవచ్చు. వ్యాపారాలు గతం కంటే మెరుగ్గా ఉంటాయి. ఉద్యోగులకు ఉత్సాహం. ఈరోజు మరింత శుభఫలితాలు పొందడం కోసం దత్తాత్రేయుని పూజించాలి. శ్రీగురుచరిత్ర పఠించడం దత్తాత్రేయ స్తోత్రాన్ని పఠించడం వలన శుభఫలితాలు కలుగుతాయి.

ధనుస్సు రాశి

ధనూరాశి వారికి నేటి రాశి ఫలాలు మధ్యస్థం నుండి అనుకూలం. మిమ్మల్ని మోసగించేందుకు కొందరు ప్రయత్నిస్తారు. వాస్తవం గ్రహించి మేల్కొనడంతో బయటపడతారు. ఆలోచనలు కలసిరాక ఇతరులపై ఆధారపడాల్సిన పరిస్థితి. వాహనాలు, భవనాలు కొనే ప్రయత్నాలు విరమించాలి. రానురాను అనుకూల పరిస్థితులుంటాయి. ఆస్తుల విషయంలో అగ్రిమెంట్లు చేసుకుంటారు. వ్యాపారాల్లోని వారికి శ్రమకు తగిన ఫలితం. ఉద్యోగులు విధులపై అసంతృప్తి నెలకొంటుంది. ఆకస్మిక ధనలాభముండును. బ్రాహ్మణులకు గానీ ముత్తైదువులకు గానీ తాంబూలం శనగలను దానమివ్వడం శ్రేయస్కరం.

మకర రాశి

మకర రాశి వారికి నేటి రాశి ఫలాల ప్రకారం ఈరోజు మీకు అనుకూలంగా లేదు. ప్రతి వ్యవహారంలో నిదానం అవసరం. ఆదాయ వ్యయాలు సమానం. ఆశ్చర్యకర నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగాన్వేషణలో ప్రతిష్టంభన. ఆస్తుల పంపకాలు, కొనుగోలులో మీ ప్రయత్నాలు ముందుకు సాగవు. వ్యాపారులకు సామాన్య ఫలితాలు. ఉద్యోగులు అప్రమత్తంగా ఉండాలి. ధనలబ్ధి, కొత్త వ్యక్తులతో పరిచయాలు ఉంటాయి. మానసిక ప్రశాంతత ఉంటుంది. దక్షిణామూర్తి స్తోత్రాలను పఠించడం చేత సమస్యలు తొలగి శుభ ఫలితాలు కలుగుతాయి.

కుంభ రాశి

కుంభ రాశి వారికి నేటి దిన ఫలాలు మధ్యస్థం. ఇంటికి సంబంధించిన వ్యవహారాలన్నీ సజావుగా పూర్తవుతాయి. కొంతకాలంగా వేధిస్తున్న ఈతి బాధలు తొలగుతాయి. రాబడి పెరుగుతుంది. విద్యార్థులు, నిరుద్యోగులు సత్తా చాటుకుంటారు. గృహ నిర్మాణాల్లో ఆటంకాలు తొలగుతాయి. ఉద్యోగులు సత్తా చూపిస్తారు. ఈరోజు మరింత శుభఫలితాలు పొందడం కోసం శ్రీగురుచరిత్ర పఠించడం, దత్తాత్రేయ స్తోత్రాన్ని పఠించడం వలన శుభఫలితాలు కలుగుతాయి.

మీన రాశి

మీన రాశి వారికి ఈ రోజు మీకు అనుకూల ఫలితాలున్నాయి. ఎటువంటి లోటు లేకుండా ఆర్థిక వ్యవహారాలు ఉంటాయి. హోదాలు పెరుగుతాయి. సమాజంలో మీకు ఎదురు ఉండదు. నిరుద్యోగుల నిరీక్షణ ఫలిస్తుంది. విద్యార్థులకు విజయాలు. ఇంటి నిర్మాణాలకు సంబంధించిన అనుమతులు లభిస్తాయి. వ్యాపారాలు ఆశించిన రీతిలో సాగుతాయి. ఉద్యోగులకు కొత్త బాధ్యతలు దక్కవచ్చు. ఈరోజు మరింత శుభఫలితాలు పొందడం కోసం శనగలు దానమివ్వాలి. శనగలతో చేసిన ప్రసాదాన్ని నివేదన చేసి అది ప్రసాదంగా పంచిపెట్టాలి.

Comments


bottom of page