top of page
Shiva YT

రాశిఫలాలు


మేషం

శుభ గ్రహాల సంచారం బాగా అనుకూలంగా ఉన్నందువల్ల ఏ పనైనా సానుకూలంగా జరిగి పోతుంది. అన్ని విధాలు గానూ సహాయ సహకారాలు అందించేవారుంటారు. ఆర్థిక పరిస్థితి బాగా ఆశాజనకంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో అంచనాలకు మించి లాభాలు అందుకుంటారు. ఉద్యోగ జీవితం ఉత్సాహంగా సాగిపోతుంది. నిరుద్యోగులు దూర ప్రాంతం నుంచి ఆశించిన సమా చారం అందుకుంటారు. పెళ్లి ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. కుటుంబ జీవితం ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగిపోతుంది. ఆదాయం పెరుగుతుంది. స్నేహితుల మీద బాగా ఖర్చు చేయడం జరుగుతుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ప్రయాణాల వల్ల ఉపయోగం ఉంటుంది. ప్రతి ప్రయత్నమూ సఫలం అవుతుంది. ప్రేమ వ్యవహారాలు సాఫీగా, హ్యాపీగా సాగిపోతాయి.

వృషభం

దశమ, లాభస్థానాలు బాగా బలంగా ఉన్నందువల్ల ముఖ్యమైన పరిస్థితులు సజావుగా సాగిపో తాయి. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. మనసులోని కోరికలు నెరవేరుతాయి. ఆర్థికంగా కొద్దిపాటి ఇబ్బందులున్నప్పటికీ తోబుట్టువులకు సహాయం చేస్తారు. వృత్తి, ఉద్యోగాలు నిలకడగా ముందుకు సాగుతాయి. ప్రభుత్వోద్యోగులకు సమయం అనుకూలంగా ఉంది. ఆరోగ్యం పరవాలేదనిపిస్తుంది. బంధుమిత్రులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. వ్యాపారాల్లో చిన్నపాటి సమస్యలు పరిష్కారం అవుతాయి. నిరుద్యోగులకు, అవివాహి తులకు సమయం ఆశించిన దానికంటే బాగుంటుంది. తక్కువ ప్రయత్నంతో ఎక్కువ లాభం పొందుతారు. అనుకోకుండా ఒకటి రెండు శుభవార్తలు వింటారు. ప్రేమ వ్యవహారాల్లో ముందంజ వేస్తారు.

మిథునం

గురు, శుక్ర, బుధ గ్రహాల ప్రభావం అనుకూలంగా ఉన్నందువల్ల ఎక్కువగా శుభవార్తలు వినడం జరుగుతుంది. అనుకోకుండా ఒక శుభ పరిణామం కూడా చోటు చేసుకుంటుంది. ఆర్థిక ప్రయత్నాలకు, అదనపు ఆదాయ ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. ఎంత సానుకూలంగా వ్యవహరిస్తే అంత మంచిది. బాగా సన్నిహితులైన బంధుమిత్రులకు ఆర్థికంగా, ఉద్యోగపరంగా సహాయం చేయడం జరుగుతుంది. ముఖ్యమైన వ్యవహారాలను, పనులను ఒంటరిగా సకాలంలో పూర్తి చేస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో అనుకూలతలు పెరుగుతాయి. వ్యాపారాల్లో ఆశించినంతగా లాభాలు అందుకుంటారు. నిరుద్యోగులకు కోరుకున్న కంపెనీల్లో ఆశించిన ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఒక పథకం ప్రకారం పని చేయడం మంచిది. ప్రేమ వ్యవహారాల్లో దూసుకుపోతారు.

కర్కాటకం

అష్టమ శని కారణంగా పని ఒత్తిడి, పని భారం వంటివి ఉన్నప్పటికీ వారమంతా ఎంతో ప్రశాం తంగా, సానుకూలంగా గడపడానికి ప్రయత్నిస్తారు. ఎక్కువగా ఆర్థిక లావాదేవీలు పెట్టుకోకపో వడం మంచిది. డబ్బు ఇవ్వడం, తీసుకోవడం వంటివి చేయవద్దు. మిగిలిన అన్ని విషయాలు బాగానే ఉంటాయి. వృత్తి, వ్యాపారాల్లో కొత్త నిర్ణయాలను, కొత్త ఆలోచనలను అమలు చేస్తారు. ఉద్యోగంలో మీ సలహాలు, సూచనలు అధికారులకు నచ్చుతాయి. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండకపోవచ్చు. అదనపు ఆదాయ మార్గాలకు సంబంధించి ఆశించిన శుభవార్త వినే అవ కాశం ఉంది. తోబుట్టువులతో సఖ్యత ఏర్పడుతుంది. కుటుంబ పెద్దల నుంచి సహాయ సహకా రాలు లభిస్తాయి. ప్రేమ వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించడం మంచిది. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి.

సింహం

గురు, శుక్రుల అనుకూల సంచారం అనేక విధాలుగా శుభ వార్తలను అందిస్తుంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఒకటి రెండు ముఖ్యమైన వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. అన్ని విధాలుగానూ ఊరట లభిస్తుంది. మొత్తం మీద వారమంతా అనుకూలంగా గడిచిపోతుంది. ఉద్యోగపరంగా చిన్న చిన్న సమస్యలున్నా తేలికగా పరిష్కరించుకుంటారు. వృత్తి జీవితంలో తీరిక లేని పరిస్థితి ఏర్పడుతుంది. అంచనాలకు మించిన రాబడి ఉంటుంది. వ్యాపా రాల్లో ఆశించినంతగా లాభాలు చవిచూస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గానే ఉంటుంది. అనవసర ఖర్చుల్ని మరింతగా తగ్గించుకోవాలి. కుటుంబ వ్యవహారాల మీద శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. ఆధ్యాత్మిక చింతన పెరిగి, ఇష్టమైన ఆలయాలు సందర్శిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో సఖ్యత పెరుగుతుంది.

కన్య

ఆరవ స్థానంలో శనీశ్వరుడు, నాలుగవ స్థానంలో రాశ్యధిపతి బుధుడు వీలైనంతగా అదృష్టాన్ని కలిగిస్తారు. కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లి విరుస్తాయి. ఒకటి రెండు ముఖ్యమైన సమస్యలు పరిష్కారం అవుతాయి. గృహ, వాహన సంబంధమైన సౌకర్యాలు ఏర్పడే అవకాశం ఉంది. ఇష్ట మైన బంధువులు, సన్నిహితులను కలుసుకుంటారు. ఆధ్యాత్మిక చింతనలో ఎక్కువ సమయం గడుపుతారు. పిల్లల నుంచి సంతోషకరమైన సమాచారం అందుకుంటారు. పెళ్లి ప్రయత్నాలకు సంబంధించి బంధువర్గం నుంచి శుభవార్త అందుతుంది. కుటుంబ సభ్యులతో విహార యాత్రకు ప్లాన్ చేస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో మీ మాటకు తిరుగుండదు. వ్యాపారాల్లో లాభాలు ఆశాజనకంగా ఉంటాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో మీ మాట బాగా చెల్లుబాటువుతుంది.

తుల

శుభ గ్రహాల అనుకూలత వల్ల వారమంతా అదృష్టవంతంగా గడిచిపోతుంది. ఆర్థిక పరిస్థితి బాగా అనుకూలంగా ఉంటుంది. అనేక విధాలుగా ధనాదాయం పెరుగుతుంది. ఒకటి రెండు శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. మీ సలహాలు, సూచనల వల్ల బంధువులు ప్రయోజనం పొందుతారు. మంచి పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. ఉద్యోగంలో అధికారులు మీ మీద ఎక్కువగా ఆధారపడడం జరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో పోటీదార్లను మించిపోతారు. ఒకరిద్దరు మిత్రులకు ఆర్థికంగా సహాయం చేయాల్సి వస్తుంది. చిన్ననాటి మిత్రులతో విందులో పాల్గొంటారు. కుటుంబ సభ్యులతో కలిసి బాగా ఇష్టమైన ఆలయాలకు వెడతారు. పిల్లలు ఆశించిన శుభవార్త తీసుకువస్తారు. ప్రేమ వ్యవహారాలు చాలావరకు ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగిపోతాయి.

వృశ్చికం

అర్ధాష్టమి కారణంగా ఇంటా బయటా ఒత్తిడి ఉండే అవకాశం ఉంది. అయితే, ముఖ్యమైన పనులు, వ్యవహారాలను గట్టి ప్రయత్నంతో పూర్తి చేస్తారు. ప్రతికూల ఫలితాలకన్నా అనుకూల ఫలితాలు ఎక్కువగా అనుభవానికి వస్తాయి. ఆదాయానికి లోటుండదు కానీ, అనవసర ఖర్చుల వల్ల ఇబ్బంది పడతారు. ఉద్యోగంలో ప్రమోషన్ రావడానికి వీలుంది. సహోద్యోగుల నుంచి ఆశించిన సహకారం అందుతుంది. వృత్తి జీవితంలో గుర్తింపు లభించి డిమాండ్ పెరుగుతుంది. వ్యాపారాల్లో రాబడి కొద్దిగా పెరుగుతుంది. కొద్దిపాటి అనారోగ్యానికి అవకాశం ఉంది. ఊహించని విధంగా ఒకటి రెండు శుభవార్తలు వింటారు. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది. కొందరు బంధువులు రకరకాల ప్రచారాలతో ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది.

ధనుస్సు

దాదాపు గ్రహాలన్నీ అనుకూలంగా ఉండడం వల్ల అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తి కావడం జరుగుతుంది. ఎటువంటి ప్రయత్నమైనా విజయవంతం అవుతుంది. ఎక్కువగా శుభ వార్తలు వినడం, శుభ పరిణామాలు చోటు చేసుకోవడం జరుగుతుంది. అత్యవసర వ్యవహారాలను సకాలంలో పూర్తి చేయగలుగుతారు. సంతానపరంగా శుభవార్తలు వింటారు. విద్య, ఉద్యోగాల విషయంలో విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుకుంటారు. ఉద్యోగంలో అధికారులు ప్రత్యేక బాధ్యతలను అప్పగించే అవకాశం ఉంది. డాక్టర్లు, లాయర్లకు పని భారం పెరుగుతుంది. అన్ని రంగాల వారికి సమయం అనుకూలంగా ఉంది. కొత్త ప్రయత్నాలు, కొత్త కార్యక్రమాలు తప్పకుండా సఫలం అవుతాయి. ఆరోగ్యం పరవాలేదు. ప్రేమ వ్యవహారాలు సానుకూలంగా సాగిపోతాయి.

మకరం

వారమంతా మిశ్రమ ఫలితాలలో సాగిపోతుంది. కొద్దిగా ఏలిన్నాటి శని ప్రభావం వల్ల రావలసిన డబ్బు ఆలస్యంగా అందుతుంటుంది. బంధుమిత్రులు అపార్థాలు చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఆచితూచి వ్యవహరించడం మంచిది. వృత్తి, వ్యాపారాల్లో శ్రమ ఎక్కువ, ఫలితం తక్కువ అన్నట్టుగా ఉంటుంది. ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. ఇంటా బయటా బాధ్యతలు పెరుగుతాయి. ఓర్పు, సహనాలతో వ్యవహరిస్తే అన్ని సమస్యలూ నిదానంగా సర్దుకుంటాయి. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు తలెత్తవచ్చు. ముఖ్యమైన వ్యవహారాల్లో జీవిత భాగ స్వామి సహకారం లభిస్తుంది. సన్నిహితుల నుంచి ఆశించిన సమాచారం అందుకుంటారు. ఆదాయానికి, ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండకపోవచ్చు. ప్రేమ వ్యవహారాలలో ముందడుగు వేస్తారు.

కుంభం

ఏలిన్నాటి శని కారణంగా ముఖ్యమైన పనులు ఆలస్యం అవుతుంటాయి. ముఖ్యమైన వ్యవహా రాలు మందకొడిగా సాగుతాయి. కొద్దిగా అసంతృప్తిగా, అసహనంగా ఉండవచ్చు. వృత్తి, ఉద్యోగాల్లో ఒకటి రెండు సమస్యలు ఎదురైనప్పటికీ, వాటిని తేలికగా పరిష్కరించుకుంటారు. బరువు బాధ్య తలు పెరిగే సూచనలున్నాయి. ఆదాయం బాగానే ఉంటుంది. రావలసిన డబ్బు చేతికి అందు తుంది. ముఖ్యమైన అవసరాలు తీరిపోతాయి. ప్రస్తుతానికి ఎవరితోనూ ఆర్థిక వ్యవహారాలు పెట్టు కోకపోవడం మంచిది. వ్యాపారాలు ఆశాజనకంగా ముందుకు సాగిపోతాయి. నిరుద్యోగులకు ఆశించిన సమాచారం అందుతుంది. ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదు. ఆధ్యాత్మిక చింతన పెరగడం కారణంగా ఆలయాలు సందర్శిస్తారు. ప్రేమ వ్యవహారాలు సాధారణంగా సాగిపోతాయి.

మీనం

మధ్య మధ్య ఏలిన్నాటి శని ప్రభావం కనిపిస్తుంటుంది. ముఖ్యమైన పనులు ఆలస్యం కావడం, స్వల్ప అనారోగ్యాలు వంటివి తప్పకపోవచ్చు. ఇంటా బయటా బాగా ఒత్తిడి ఉంటుంది. శ్రమ తిప్పట కూడా ఉంటాయి. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండదు కానీ, వృత్తి, ఉద్యోగాల్లో కొద్దిగా చికాకులు తలెత్తుతాయి. సానుకూల దృక్పథంతో వ్యవహరించాల్సి ఉంటుంది. వ్యాపారాలు లాభ దాయకంగా ముందుకు సాగుతాయి. పిల్లల నుంచి ఆశించిన శుభవార్తలు వింటారు. దూరపు బంధువులతో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. నిరుద్యోగులకు కొద్దిపాటి ప్రయత్నంతో సొంత ఊర్లోనే ఉద్యోగం లభించే సూచనలున్నాయి. కొందరు మిత్రులకు అండగా నిలబడతారు. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ప్రేమ వ్యవహారాల్లో సఖ్యత, సాన్నిహిత్యం పెరుగు తాయి.

bottom of page