top of page

రాశిఫలాలు


మేషం

శని, గురు, బుధ, రవులు అనుకూలంగా ఉనందు వల్ల అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. మనసులోని కోరికలు నెరవేరుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు సానుకూలంగా సాగి పోతాయి. వృత్తి, ఉద్యోగాలలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. వ్యాపారాలు లాభ సాటిగా కొనసాగుతాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. చేపట్టిన పనులు వేగంగా పూర్తి చేస్తారు. విద్యార్థులు తేలికగా విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. వృషభం

రాశినాథుడైన శుక్రుడు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల రోజంతా ప్రశాంతంగా, సుఖ సంతోషాలతో గడిచిపోతుంది. గృహ నిర్మాణ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. సతీమణికి కెరీర్ లో ఆశించిన పురోగతి ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగిపోతాయి. నిరుద్యోగు లకు సొంత ఊర్లోనే ఉద్యోగం లభించే అవకాశం ఉంది. విద్యార్థులు తేలికగా విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు సానుకూలంగా సాగిపోతాయి. ఆరోగ్యం చాలావరకు అనుకూలంగా ఉంటుంది.

మిథునం

గురు, బుధ గ్రహాలు మంచి యోగాన్ని ఇవ్వడం జరుగుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో ఆశించిన దాని కంటే ఎక్కువగా పురోగతి కనిపిస్తుంది. వృత్తి, వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. తలపెట్టిన పనులన్నిటినీ పట్టుదలగా పూర్తి చేస్తారు. చిన్ననాటి స్నేహితులు సహాయ సహ కారాలు అందజేస్తారు. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులు కష్టపడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా, సాఫీగా సాగిపోతాయి.

కర్కాటకం

ధన స్థానంలో శుక్రుడు, చతుర్థ స్థానంలోరవి, బుధులు ఉండడం వల్ల ఆర్థిక వ్యవహారాలు ఆశా జనకంగా ఉంటాయి. అనుకున్న సమయానికి పనులు పూర్తి చేసుకోగలుగుతారు. బంధువుల రాకపోకలుంటాయి. పిల్లల నుంచి శుభవార్తలు అందుకుంటారు. ఉద్యోగ జీవితం సంతృప్తికరంగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో రాబడి పెరుగుతుంది. రావలసిన డబ్బు సకాలంలో చేతికి అందుతుంది. విద్యార్థులకు సమయం బాగుంది. ప్రేమ వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించడం మంచిది.

సింహం

గురు, బుధ, శుక్ర గ్రహాల అనుకూలత వల్ల వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన స్థాయిలో రాబడి పెరుగు తుంది. ఆదాయ మార్గాలు వృద్ధి చెందుతాయి. ఉద్యోగ జీవితంలో సానుకూల వాతావరణం ఉంటుంది. అధికారులు మీ సలహాలు, సూచనలతో ప్రయోజనం పొందుతారు. కుటుంబ సభ్యు లతో సఖ్యత పెరుగుతుంది. వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. విద్యార్థులు పురోగతి సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు సాధారణంగా సాగి పోతాయి. ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదు.

కన్య

గురు గ్రహం ప్రతికూలంగా ఉన్న కారణంగా కొద్దిగా మానసిక ఒత్తిడి ఉంటుంది. స్వల్ప అనారోగ్యా నికి కూడా అవకాశం ఉంది. చిన్ననాటి మిత్రుల నుంచి సహకారం లభిస్తుంది. ముఖ్యమైన వ్యవ హారాలను నిదానంగా పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఉద్యోగ జీవి తం సాఫీగా సాగిపోతుంది. కుటుంబ సభ్యులతో దైవ కార్యాల్లో పాల్గొంటారు. విద్యార్థులు చదువు లపై శ్రద్ధ పెంచాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు నత్తనడక నడుస్తాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

తుల

గురు, బుధ, రవుల అనుకూలత ఎక్కువగా ఉన్నందువల్ల ఏ ప్రయత్నం తలపెట్టినా విజయ వంతం అవుతుంది. మనసులోని కోరికలు నెరవేరుతాయి. వృత్తి, ఉద్యోగాలు సానుకూలంగా సాగి పోతాయి. వ్యాపారంలో బాగా బిజీ అవుతారు. యాక్టివిటీ పెరుగుతుంది. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. తలపెట్టిన పనులు వేగంగా పూర్తవుతాయి. రాదనుకున్న డబ్బు చేతికి అందు తుంది. విద్యార్థులు సునాయాసంగా విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో దూసుకు పోతారు.

వృశ్చికం

శుక్ర, రాహు గ్రహాలు అనుకూలంగా ఉన్నందువల్ల ఆర్థిక పరిస్థితి చాలావరకు మెరుగుపడు తుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు నిలకడగా ముందుకు సాగుతాయి. ఉద్యోగాల్లో మంచి అవకా శాలు అందివస్తాయి. నిరుద్యోగులకు కూడా ఆఫర్లు అందుతాయి. సమాజంలో మీ మాటకు, చేతకు విలువ పెరుగుతుంది. రాజకీయ నేతలతో పరిచయాలు పెరుగుతాయి. విద్యార్థులకు సమ యం అనుకూలంగా ఉంది. ఆరోగ్యం పరవాలేదు. ప్రేమ వ్యవహారాలు మామూలుగా సాగిపో తాయి.

ధనుస్సు

పంచమ స్థానంలో ఉన్న గురువు, తృతీయంలో ఉన్న శనీశ్వరుడి కారణంగా, ఆర్థికంగా ఆశించిన మేరకు పురోగతి సాధిస్తారు. నిరుద్యోగుల ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో సొంత నిర్ణయాలు అమలు చేసి ఆర్థికంగా ప్రయోజనం పొందుతారు. ఉద్యోగంలో పదోన్నతికి అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాల్లో పురోగతి ఉంటుంది. విద్యార్థులు శ్రమపడాల్సి ఉంటుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

మకరం

ధన స్థానంలో ఉన్న శనీశ్వరుడు, దశమ స్థానంలో రవి, బుధుల కారణంగా వృత్తి, ఉద్యోగాల పరంగా ఆశించిన శుభ వార్తలు వింటారు. శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆర్థిక ప్రయ త్నాలు బాగా కలిసి వస్తాయి. సమాజంలో పలుకుబడి, గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వ్యాపా రాల్లో లాభాలు పెరుగుతాయి. నిరుద్యోగులకు సమయం అనుకూలంగా ఉంది. ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. విద్యార్థులు విజయాలు సాధిస్తారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది.

కుంభం

సప్తమంలో శుక్రుడు, భాగ్య స్థానంలో రవి, బుధుల సంచారం కారణంగా ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. అనేక మార్గాలలో ఆదాయం పెరుగుతుంది. వృథా ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సభ్యులతో హ్యాపీగా కాలక్షేపం చేయడం జరుగుతుంది. ఉద్యోగంలో ప్రాధాన్యం పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు వేగం పుంజుకుంటాయి. దూర ప్రాంతం నుంచి శుభవార్తలు వింటారు. విద్యార్థులకు శ్రమ పెరుగుతుంది. సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు సమస్యలకు దారి తీస్తాయి.

మీనం

ధన స్థానంలో గురు గ్రహం అనుకూలంగా ఉన్నందువల్ల ఆర్థికంగా అంచనాలకు మించిన పురోగతి ఉంటుంది. తలపెట్టిన పనులు, వ్యవహారాలు సజావుగా సాగిపోతాయి. వృత్తి ఉద్యోగాలు కొత్త పుంతలు తొక్కుతాయి. కొత్త ప్రయత్నాల వల్ల ఆశించిన స్థాయిలో ఉపయోగం ఉంటుంది. వ్యాపారాల్లో మీ ఆలోచనలు, వ్యూహాలు లాభాలను తీసుకు వస్తాయి. దైవ చింతన పెరుగు తుంది. విద్యార్థులు పురోగతి చెందుతారు. ప్రేమ వ్యవహారాలు సాఫీగా, హ్యాపీగా సాగిపోతాయి.

Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page