top of page
Shiva YT

రాశిఫలాలు


మేషం

ఉద్యోగపరంగా మంచి పరిణామాలు చోటు చేసుకుంటాయి. వీలైనంతగా సానుకూల దృక్పథంతో వ్యవహరించడం మంచిది. కుటుంబ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తారు. పిల్లలు ఆశించిన స్థాయిలో వృద్ధిలోకి వస్తారు. ఉద్యోగ విధులను సమర్థవంతంగా నిర్వహించి అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. డాక్టర్లు, లాయర్లు తదితర వృత్తుల వారికి డిమాండ్ ఏర్పడుతుంది. ఆహార విహారాల్లో జాగ్రత్తలు పాటించడం మంచిది. దూర ప్రాంతం నుంచి శుభ సమాచారం అందు కుంటారు.

వృషభం

వృత్తి, వ్యాపారాల్లో సొంత నిర్ణయాలతో ముందుకు వెడతారు. మిత్రులతో కలిసి ఒక శుభ కా ర్యంలో పాల్గొంటారు. రాదనుకుని వదిలేసుకున్న డబ్బు, బకాయిలు చేతికి అందుతాయి. స్థిరాస్తి సంబంధమైన వివాదం నుంచి బయటపడతారు. వృత్తి, ఉద్యోగాలు ఉత్సాహంగా ముందుకు సాగు తాయి. ఇంటా బయటా శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఎవరి విషయంలోనూ తల దూర్చ వద్దు. కుటుంబ జీవితం ప్రశాంతంగా, సామరస్యంగా సాగిపోతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

మిథునం

రోజంతా చాలావరకు ప్రశాంతంగా గడిచిపోతుంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఉద్యోగరీత్యా ప్రయాణ సూచనలున్నాయి. వృత్తి, వ్యాపారాలు నష్టాల నుంచి బయటపడే అవకాశం ఉంది. నిరుద్యోగుల శ్రమ ఫలిస్తుంది. సమాజంలో గౌరవాభిమానాలు పెరుగుతాయి. మాటకు, చేతకు విలువ ఉంటుంది. మీ సలహాలు, సూచనల వల్ల అధికారులు ఆశించిన ప్రయోజనం పొందుతారు. మిత్రుల వల్ల కొద్దిగా నష్టపోయే అవకాశం ఉంది. ఆరోగ్యం పరవాలేదు.

కర్కాటకం

వ్యాపారాలలో అనేక విధాలుగా లాభాలు అందుకుంటారు. వృత్తి, ఉద్యోగాలలో హోదా, స్థాయి పెరు గుతాయి. అవసర సమయాల్లో స్నేహితులు అండగా నిలబడతారు. ఉన్నత స్థానాలలో ఉన్న వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆకస్మిక ధనలాభ సూచనలున్నాయి. విలువైన వస్తు సామగ్రి కొనుగోలు చేస్తారు. గతంలో తీసుకున్న నిర్ణయాలు, చేపట్టిన ప్రయత్నాలు శుభ ఫలితా లను ఇవ్వడం ప్రారంభిస్తాయి. అనుకోకుండా సోదరులతో ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి.

సింహం

దాదాపు అన్ని రంగాల వారికి వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం విషయంలో మాత్రం జాగ్రత్తలు పాటించడం మంచిది. ఉద్యోగ జీవితం చాలావరకు సాఫీగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో అనుకోకుండా డిమాండ్ పెరిగి క్షణం కూడా తీరిక లేని పరిస్థితి ఏర్పడుతుంది. కుటుంబ వాతావరణం చాలావరకు ప్రశాంతంగా ఉంటుంది. రహస్యంగా ఉంచాల్సిన వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోకపోవడం మంచిది. ప్రయాణాలలో వీలైనంత జాగ్రత్తగా ఉండాలి.

కన్య

వృత్తి, వ్యాపారాల్లో ఆర్థిక పురోగతి సాధిస్తారు. ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరుగుతాయి. శరీరానికి విశ్రాంతి ఉండకపోవచ్చు. ఆశించిన పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. కుటుం బంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. కొద్దిపాటి శ్రమతో అధిక లాభం పొందుతారు. నిరుద్యో గులు మంచి ఉద్యోగం సంపాదించడం జరుగుతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో కుటుంబ పెద్దల సలహాలు, సూచనలు తీసుకుని ముందుకు వెళ్లడం మంచిది.

తుల

సమాజంలో ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. చేపట్టిన పనులు, వ్యవహా రాలు సునాయాసంగా పూర్తి అవుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంది. ఉద్యోగంలో అధికారుల నుంచి కొద్దిగా ఒత్తిడి ఉంటుంది. సహోద్యోగుల నుంచి ఇబ్బందులు ఎదు రయ్యే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో తీరిక ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. సతీమణి సహా యంతో ముఖ్యమైన సమస్యల్ని పరిష్కరించుకుంటారు. ఎవరికీ హామీలు ఉండకపోవడం మంచిది.

వృశ్చికం

చిన్నపాటి అనారోగ్యంతో ఇబ్బందిపడే అవకాశం ఉంది. శరీరానికి విశ్రాంతి అవసరమని అర్థం చేసుకోండి. వృత్తి, వ్యాపారాల్లో కొన్ని సమస్యలు అనుకోకుండా పరిష్కారం అవుతాయి. లాభాలకు లోటుండదు. ఆర్థిక పరిస్థితులు చాలావరకు చక్కబడతాయి. బంధుమిత్రులతో సాన్నిహిత్యం పెరుగుతుంది. ఉద్యోగంలో బరువు బాధ్యతలు బాగా పెరుగుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగావకా శాలు అంది వస్తాయి. ఆస్తి వివాదాలకు పరిష్కారం లభించవచ్చు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది.

ధనుస్సు

ఉద్యోగంలో కొన్ని సానుకూల మార్పులకు అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో ఉత్సాహకర వాతావరణం ఉంటుంది. ఒకటి రెండు వ్యక్తిగత సమ స్యలు పరిష్కారం అవుతాయి. తండ్రి జోక్యంతో స్థిరాస్తి వివాదం కొలిక్కి వస్తుంది. ఎవరికీ ఎటు వంటి వాగ్దానాలూ చేయవద్దు. కొందరు దగ్గర వ్యక్తులు తప్పుదోవ పట్టించే సూచనలున్నాయి. దైవ కార్యాల్లో పాల్గొంటారు. ఇతరులకు ఇతోధికంగా సహాయం చేస్తారు. ఆరోగ్యం పరవాలేదు.

మకరం

అనుకోకుండా ఒకటి రెండు శుభవార్తలు వింటారు. వృత్తి, వ్యాపారాల్లో వ్యూహాలు మార్చుకుం టారు. నిరుద్యోగులకు ఉద్యోగ సంబంధమైన కీలక సమాచారం అందుతుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. బంధుమిత్రుల నుంచి సహకారం అందుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి పుణ్య కార్యంలో పాల్గొంటారు. ఆర్థికంగా అనుకూల పరిస్థితి ఏర్పడుతుంది. ఉద్యోగం మార డానికి చేసే ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. ఆరోగ్యం చాలావరకు అనుకూలంగా ఉంటుంది.

కుంభం

ఉద్యోగాలలో బరువు బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. అధికారుల నుంచి ఆశించిన ప్రోత్సాహకాలు అందుతాయి. స్థిరాస్తి వ్యవహారాలు కొద్దిగా అనుకూలంగా మారతాయి. వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన లాభాలు అందుకుంటారు. జీవిత భాగస్వామితో దైవ కార్యాల్లో పాల్గొంటారు. నిరుద్యోగు లకు ఆశించిన సానుకూల సమాచారం అందుతుంది. సర్వత్రా మీ మాట చెల్లుబాటు అవుతుంది. పిల్లల భవిష్యత్తు మీద దృష్టి కేంద్రీకరిస్తారు. పట్టుదలగా కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు.

మీనం

ఉద్యోగంలో మీ మాటకు తిరుగుండదు. వృత్తి, వ్యాపారాలలో సంపాదన పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో ఆలయాలు సందర్శిస్తారు. ఆదాయ పరంగా కొత్త ప్రయత్నాల మీద దృష్టి సారిస్తారు. ముఖ్యమైన వ్యవహారాల కారణంగా నిమిషం కూడా తీరిక ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. అనవసర పరిచయాలకు వీలైనంత దూరంగా ఉండటం చాలా మంచిది. ప్రయాణాలలో కాస్తంత అప్రమ త్తంగా వ్యవహరించాలి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి చాలావరకు బయటపడతారు.

bottom of page